రిసెప్షన్‌ సెంటర్‌ కీలకొం

పోలింగ్‌ అనంతరం ఇవిఎంలను భద్రపరచడానికి కేటాయించిన శివానీ ఇంజినీరింగ్‌

మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌

కేటాయించిన రూట్ల వాహనాలకు అనుమతి 

పార్కింగ్‌ స్థలాల్లో నిలుపుదలకు అవకాశం

కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి – ఎచ్చెర్ల

పోలింగ్‌ అనంతరం ఇవిఎంలను భద్రపరచడానికి కేటాయించిన శివానీ ఇంజినీరింగ్‌ కళాశాలలో రిసెప్షన్‌ కౌంటర్‌ కీలకమని జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌ అన్నారు. కేటాయించిన రూట్ల ద్వారా పార్కింగ్‌ వద్దకే వాహనాలు చేరుకోవాలని ఆదేశించారు. స్థానిక శివానీ ఇంజినీరింగ్‌ కళాశాలలో రిసెప్షన్‌, స్ట్రాంగ్‌రూమ్‌ వద్ద వహించాల్సిన జాగ్రత్తలపై బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్‌ అనంతరం ఇవిఎంలు స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరచాలన్నారు. ఎక్కడికక్కడ సైనేజ్‌ బోర్డులు, లైటింగ్‌ ఏర్పాటు చేసినట్లు వివరించారు. రిటర్నింగ్‌ అధికారులు కౌంట్‌ చేసుకొని అన్ని వాహనాలు సులువుగా వచ్చేలా చూడాలన్నారు. ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్‌ ప్రాంతాల్లో వైద్యారోగ్యశాఖ స్టాల్స్‌ ఏర్పాటు చేయాలని డిఎంహెచ్‌ఒను ఆదేశించారు.జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ మాట్లాడుతూ ఆయా నియోజక వర్గాలకు సంబంధించి సైనేజస్‌ ఏర్పాటు చేస్తామ న్నారు. జాగ్రత్తగా చూసుకుని వాహనాలు ఆయా నియోజకవర్గాలకు చేరుకోవాలని తెలిపారు. లోపలికి ప్రవేశము, వెలుపలికి వెళ్లే రూట్లను ముందుగానే చూసుకోవాలని చెప్పారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ తమీమా అన్సారియా మాట్లాడుతూ ఎవరికి కేటాయించిన విధులు వారు నిర్వహించాలన్నారు. చేయాల్సిన ప్రతి పనిని తయారు చేసుకొని ఒక్కో పని పూర్తి చేయాలన్నారు. పార్కింగ్‌ ఏరియా వద్ద, పార్కింగ్‌ పక్కన మరుగుదొడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు పారిశుధ్య కార్మికులు ఉంటా రని చెప్పారు. తాగునీరు ఏర్పాటు చేసి నట్లు తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. సమావేశంలో రిటర్నింగ్‌ అధికారులు నూరుల్‌ కమర్‌, భరత్‌ నాయక్‌, సిహెచ్‌.రంగయ్య, రామ్మోహన్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, డిఆర్‌ఒ ఎం.గణపతిరావు, ఎఎస్‌పి ప్రేమ్‌కాజల్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

➡️