కూటమి మేనిఫెస్టో ఆచరణ అసాధ్యం: దొర

May 8,2024 20:58

ప్రజాశక్తి- మెంటాడ : టిడిపి, జనసేన, బిజెపి కూటమి మేనిఫెస్టో ఆచరణ అసాధ్యమని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర స్పష్టంచేశారు. బుధవారం మండలంలో పిట్టాడ, మెంటాడ, చింతలవలస, కైలాం, చల్లపేట, ఇద్దనవలస, కొంపంగి, మీసాలపేట, పోరాం గ్రామాల్లో రాజన్నదొర ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆయా గ్రామాల్లో రోడ్‌షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ప్రజల బాగోగులకు ఎటువంటి లోటూ లేకుండా చూసుకున్నారని స్పష్టంచేశారు. నవరత్నాలతో పాటు అదనంగా ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్‌కే దక్కుతుందని చెప్పారు. చంద్రబాబు, పవన్‌ మోసపూరిత ప్రకటనలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టంచేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరోసారి వైసిపిని గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రెడ్డి సన్యాసినాయుడు, వైస్‌ ఎంపిపి సారిక ఈశ్వరరావు, మండల సచివాలయ కన్వీనర్‌ కనిమెరక త్రినాథరావు, వైసిపి మండల అధ్యక్షులు రాయిపిల్లి రామారావు, పిట్టాడ, మెంటాడ సర్పంచులు కాపారపు పైడిపునాయుడు, రేగిడి రాంబాబు, ఎంపిటిసి పతివాడ కుమారి, దంతులూరి రంగరాజు, సిరిశెట్టి నారాయణరావు, పి.సన్యాసిరావు, జి.అప్పలనాయుడు, పాల్గొన్నారు.ప్రజా సంక్షేమం.. వైసిపికే సాధ్యం: శంబంగిబొబ్బిలి: వైసిపి ప్రభుత్వంతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు తెలిపారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లిలో 14, 27 వార్డుల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుపెన్నడూ లేని విధంగా అర్హత ఉన్న లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. దీనికి కారణం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మాత్రమేనని చెప్పారు. ఇదే విధంగా సంక్షేమ పథకాలు కొనసాగాలంటే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటు హక్కును ఫ్యాన్‌ గుర్తుపై వేయాలని కోరారు.వైసిపికి ఎంఆర్‌పిఎస్‌ మద్దతు సార్వత్రిక ఎన్నికల్లో వైసిపికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఎంఆర్‌పిఎస్‌ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మయ్య మాదిగ ప్రకటించారు. స్థానిక వైసిపి కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి గెలుపు పేదల విజయమని అన్నారు. అబద్ధాలతో కూటమి గెలుపొందేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. మందకృష్ణ మాదిగ ఎన్‌డిఎకు అమ్ముడు పోయారని విమర్శించారు. వర్గీకరణను పక్కన పెట్టిన బిజెపికి మద్దతు ఇవ్వడం సరికాదన్నారు. ఎంఆర్‌పిఎస్‌ ఉద్యమాన్ని నాశనం చేసే చంద్రబాబుకు మద్దతు ఇవ్వడానికి సిగ్గు లేదా? అని మందకృష్ణను ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో వైసిపిని గెలిపించాలని కోరారు. సమావేశంలో సుధాకర్‌ మాదిగ, వైసిపి నాయకులు శంబంగి వేణుగోపాలనాయుడు, జెడ్‌పిటిసి సంకిలి శాంతకుమారి, పాల్గొన్నారు.వైసిపిని మరోసారి ఆదరించండి: ఎమ్మెల్యే బడ్డుకొండనెల్లిమర్ల: సార్వత్రిక ఎన్నికల్లో వైసిపిని మరోసారి ఆదరించి గెలిపించాలని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కోరారు. బుధవారం మండలంలోని సారిపల్లి, మొయిద గ్రామాల్లో ఎమ్మెల్సీ పి.సురేష్‌బాబుతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ మరోసారి ఫ్యాన్‌ గుర్తుకి ఓటు వేసి బడ్డుకొండ అప్పలనాయుడును ఎమ్మెల్యేగా, బెల్లాన చంద్రశేఖర్‌ను ఎమ్‌పిగా గెలిపించాలని కోరారు. ప్రచారంలో ఎంపిపి అంబళ్ల సుధారాణి, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములు నాయుడు, మండల అధ్యక్షుడు చనమల్ల వెంకటరమణ, జెడ్‌పిటిసి సభ్యులు గదల సన్యాసినాయుడు, వైస్‌ ఎంపిపిలు పతివాడ సత్యనారాయణ, సారికి వైకుంఠం నాయుడు, ఎంపిటిసి సంతోష్‌ బాబు, రేగాన శ్రీనివాసరావు, రాయి విభీషణరావు, నడిపేన ఆనంద్‌, సారిపల్లి గుర్నాథరావు, అట్టాడ కృష్ణ, దవల లక్ష్మణరావు పాల్గొన్నారు.పారదర్శిక పాలన అందించడమే ధ్యేయండెంకాడ: పారదర్శిక పాలన అందించడమే తమ ధ్యేయమని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. మండలంలోని జొన్నాడ, ఆకులపేట, గొలగాం గ్రామాల్లో ఆయన బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ ప్రజలకు మంచి చేసిన వైసిపిని మరోసారి ఆశీర్వాదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బంటుపల్లి వెంకట వాసుదేవరావు, వైస్‌ ఎంపిపి ఎన్నింటి తమ్మునాయుడు, ఎమ్మెల్యే తనయుడు బడ్డుకొండ మణిదీప్‌నాయుడు, నాయకులు పతివాడ కృష్ణవేణి, జొన్నాడ సర్పంచ్‌ కోరాడ రమణి, కోటి నాయుడు, ఆకుల పేట సర్పంచ్‌ సువ్వాడ రమేష్‌, ఎంపిటిసి దేవి, మురళి తదితరులు పాల్గొన్నారు.నేడు సవరపల్లిలో ప్రచారంభోగాపురం: మండలంలోని సవరవల్లి పంచాయతీలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు వైసిపి మండల అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్‌పి అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌ హాజరుకానున్నారని తెలిపారు. ఉదయం 10 గంటలకు నాయకులు హాజరుకావాలని ఆయన కోరారు.

➡️