ఎర్రజెండా నీడే పేదలకు అండసీపీఐ అభ్యర్ధి పి.మురళిని గెలిపిద్దాంఇండియా ఫోరం నేతల పిలుపు

ఎర్రజెండా నీడే పేదలకు అండసీపీఐ అభ్యర్ధి పి.మురళిని గెలిపిద్దాంఇండియా ఫోరం నేతల పిలుపు

ఎర్రజెండా నీడే పేదలకు అండసీపీఐ అభ్యర్ధి పి.మురళిని గెలిపిద్దాంఇండియా ఫోరం నేతల పిలుపుప్రజాశక్తి- తిరుపతి సిటీ పేదల బతుకులు బాగు పడాలంటే ఎర్రజెండాను ఆదరించాలని… తిరుపతి అసెంబ్లీకి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పి.మురళిని గెలిపించాలని ఇండియా ఫోరం నేతలు పిలుపునిచ్చారు. తిరుపతి నగర పరిధిలోని లెనిన్‌ నగర్‌, ప్రగతి నగర్‌, గరుడాద్రి నగర్‌, పార్వతీపురం, నారాయణపురం, కొరమేనుగుంట ప్రాంతాల్లో మురళిని గెలిపించాలని అభ్యర్థిస్తూ సీపీఐ, సీపీఎం,ఆమ్‌ ఆద్మీ, కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారానికి పార్టీ శ్రేణులు భారీగా తరలి వచ్చాయి. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.హరినాథరెడ్డి మాట్లాడుతూ… నేడు ప్రభుత్వాలు ఉచితం అంటున్నాయంటే అవి ఉభయ కమ్యూనిస్టు పార్టీల కషేనన్నారు. వైసీపీ పాలనలో ఏపీలో అక్రమాలు, భూ కబ్జాలు, దౌర్జన్యాలు పెరిగి పోయాయన్నారు. తిరుపతి నగరంలో అయితే ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. లెనిన్‌ నగర్‌ అభివద్ధిలో కమ్యూనిస్టు పార్టీ నేతల కషి మరువలేనిదన్నారు. పేదల బతుకులు బాగు చేయడానికి కమ్యూనిస్టు పార్టీ పోటీ చేసిందని… వారికే తమ ఓటు వేస్తామని చెప్పాలన్నారు. బూర్జువా పార్టీలకు ఓట్లు వేయడం వలన పేదల బతుకులు బాగుపడవన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ… ఇండియా కూటమి తరపున బీజేపీని ఎదిరిస్తామన్నారు. జైలుకు వెళ్లడానికి కూడా తాము సిద్ధమే అన్నారు. జగన్‌ నేడు మోదీకి వంగి వంగి దండాలు ఎందుకు పెడుతున్నాడో చెప్పాలన్నారు. జగన్‌ గెలిచిన తరువాత మోదీ వద్ద సాగిలపడతారన్నారు. ఏపీ ప్రజల హక్కులు కాలరాయడానికే టీడీపీ, వైసీపీ మోదీ భజన చేస్తున్నాయన్నారు. ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్‌ మాట్లాడుతూ… దేశంలో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు చాలా కీలకమైనవన్నారు. ఈ ఎన్నికలు భారతదేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయన్నారు. పిల్లల భవిష్యత్తు దష్టిలో పెట్టుకుని ఓటర్లు తీర్పు ఇవ్వాలని దినేష్‌ కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావులపల్లె రవీంద్ర మాట్లాడుతూ… అక్రమార్జన కేసుల్లో బెయిల్‌ పై ఉన్న వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఐదేళ్లుగా మనల్ని పరిపాలిస్తుడన్నారు. ఐదేళ్లలో ఆయన ఒక్క రోజు కూడా కోర్టుకు వాయిదాలకు వెళ్లలేదన్నారు. ఇందుకు కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోదీ ప్రభుత్వమని ఆయన ఆరోపించారు. బీజేపీ ఏం చెబితే అది చేస్తున్నందున జగన్‌ కు వారు అండగా ఉన్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి మాంగాటి గోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ… ప్రజావేదిక కూల్చివేతతో జగన్‌ తన పాలన ప్రారంభించారన్నారు. ప్రజావేదిక శిథిలాలు ఇంకా తొలగించలేదన్నారు. జగన్‌ నిత్యం అదేదారిలో వెళుతూ నవ్వుతూ పోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామానాయుడు, టి.జనార్ధన్‌, శివారెడ్డి, విశ్వనాథ్‌, చిన్నం పెంచలయ్య, సుబ్రమణ్యం, లక్ష్మి, వేణు, బాలసుబ్రమణ్యం, నరసింహులు, జిలాని పాల్గొన్నారు.

➡️