పక్కా ప్రణాళికతో తిరుపతి అభివృద్ధిశ్రీ ఇండియా వేదిక అభ్యర్థి పి.మురళికే మన ఓటుశ్రీ సిపిఎం, సిపిఐ సన్నాహక సమావేశంలో వక్తలు

పక్కా ప్రణాళికతో తిరుపతి అభివృద్ధిశ్రీ ఇండియా వేదిక అభ్యర్థి పి.మురళికే మన ఓటుశ్రీ సిపిఎం, సిపిఐ సన్నాహక సమావేశంలో వక్తలు

పక్కా ప్రణాళికతో తిరుపతి అభివృద్ధిశ్రీ ఇండియా వేదిక అభ్యర్థి పి.మురళికే మన ఓటుశ్రీ సిపిఎం, సిపిఐ సన్నాహక సమావేశంలో వక్తలుప్రజాశక్తి – తిరుపతి సిటి: తిరుపతి అభివృద్ధి ప్రణాళికాబద్దంగా జరగాలంటే ఇండియా వేదిక అభ్యర్థి పి.మురళి గెలిస్తేనే సాధ్యమని నాయకులు ఉద్ఘాటించారు. సిపిఎం, సిపిఐ సన్నాహక సమావేశం తిరుపతి ఎంబి భవన్‌లో జరిగింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.హరినాధ్‌రెడ్డి, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి మాగంటి గోపాల్‌రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, ఆమ్‌ఆద్మీ పార్టీ పార్లమెంట్‌ అధ్యక్షులు నగేష్‌, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ.రామానాయుడు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరాపు మురళి మాట్లాడుతూ ఇండియా కూటమి బలపరచిన సిపిఐ అభ్యర్థి పి.మురళిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. ప్రణాళిక లేకుండా స్మార్ట్‌సిటీ నిధులు వెచ్చించి రోడ్లు వెడల్పు చేస్తే అభివృద్ధి జరగదన్నారు. కమీషన్లకు కక్కుర్తి పడే హడావిడిగా రోడ్లను వెడల్పు చేశారన్నారు. టిటిడి నిధులను తిరుపతి అభివృద్ధికి ఉపయోగించే ధైర్యం, దమ్ము ఉందా అని ప్రశ్నించారు. టిటిడిలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకున్న వారికి అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ప్రత్యేక హోదా, మన్నవరం ప్రాజెక్టులపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కార్పొరేటర్లకు కాసుల వర్షం కురిపించి కార్పొరేషన్‌ను అవినీతిమయం చేశారన్నారు. సాధారణ కార్మికుని స్థాయి నుంచి ప్రజాసేవలో రాజీలేని పోరాటాలు నిర్వహించి కేసులకు భయపడక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా శ్రమిస్తూ జిల్లా కార్యదర్శి స్థాయికి పి.మురళి ఎదిగారన్నారు. తిరుపతి అభివృద్ధి చెందితే యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జనార్ధన్‌, వివ్వనాథ్‌, టి.సుబ్రమణ్యం, రాధాక్రిష్ణ, బండి చలపతి, నదియా, ఎన్‌డి రవి, జయచంద్ర, సాయిలక్ష్మి, వేణుగోపాల్‌, మాధవకృష్ణ, బుజ్జి, లక్ష్మీ, నరేంద్ర పాల్గొన్నారు.

➡️