చెత్త పన్ను పేరుతో ప్రజలపై భారం

Apr 8,2024 15:53 #Vizianagaram

ప్రతి నెల 57 లక్షలు వసూలు లక్ష్యం
చెత్తతో ప్రభుత్వం వ్యాపారం
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : 2021 నవంబర్ 1వ తేదీన జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరుతో, క్లీన్ ఏపీ క్లాప్ కార్యక్రమం వైసిపి ప్రభుత్వం ప్రారంభించింది. క్లీన్ ఏపీ పేరుతో ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నారు. విజయనగరం పట్టణ ప్రజలపై ఏడాదికి రూ.6.86,కోట్ల రూపాయల భారం మోపారు.స్వచ్ఛభారత్ ముసుగులో కేంద్ర ప్రభుత్వం పారిశుధ్య నిర్వహణను బడా కంపెనీలకు కట్టబెట్టడంలో భాగంగా అమలు చేస్తున్నారు. కేంద్రం ఆదేశాలకు లొంగి రాష్ట్ర ప్రభుత్వం చెత్త పన్నును ప్రజలపై రుద్దింది . రాష్ట్ర ప్రభుత్వం పారిశుధ్య నిర్వహణను ప్రైవేటీకరించి ప్రజలకు హాని చేస్తోంది, భారం మోపుతోంది, బడా కంపెనీలు, అధికార పార్టీ నేతల జేబులు నింపెందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఎన్నికైన కౌన్సిళ్ళకు తెలియకుండా చెత్త వాహనాల ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా చేసుకున్నది .ఒక్కొక్క వాహనానికి నెలకు 63,000 చొప్పున చెల్లించాలని నిర్ణయించింది. భవిష్యత్తులో సంవత్సరానికి కోట్ల రూపాయలు బడా కంపెనీలకు కట్టబెట్టే ఈ ఒప్పందం అన్ని నగర పాలక సంస్థ ల్లో అమలు చేస్తుంది.బడా కంపెనీల జేబులు నింపడం కోసం చెత్త పన్ను దౌర్జన్యంగా ప్రజల నుండి వసూలు చేస్తుంది. చెత్త పన్ను రాజ్యాంగ విరుద్ధమైనది. ఇప్పటికే ఆస్తి పన్నులో పారిశుధ్య పన్ను ఇమిడి ఉన్నది . చెత్త పన్నులు పై విజయనగరంలో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తిరగబడ్డారు.పారిశుధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణ ప్రభుత్వాల, స్థానిక సంస్థల రాజ్యాంగ బద్ధమైన బాధ్యత ఆ బాధ్యత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థకు హక్కులపై దాడి చేస్తుంది.
ఆ బాధ్యతనుండి ప్రభుత్వాలు తప్పుకొని ప్రజల మీద భారాలు మోపుతూ, బడా కంపెనీలకు లబ్ధి చేకూర్చడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పట్టణ సంస్కరణల విధానం. ప్రజల అభ్యంతరాలు స్వీకరించకుండా పన్ను వేసే అధికారం ప్రభుత్వాలకు, స్థానిక సంస్థలకు లేదు.
ప్రజారోగ్యం రోజూ రోజుకి క్షీణిస్తుందు. డెంగ్యూ, మలేరియా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి.అయినా ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసింది, కమీషనర్ మొదలు వాలంటీర్ల వరకు చెత్త పన్ను వసూళ్లలో మునిగి తేలుతున్నారు. ప్రజలను వేధించి, పీడించి, దౌర్జన్యంగా చెత్త పన్ను వసూలు చేస్తున్నారు. నెల వారి వృద్దులకు ఇచే పెన్షన్ డబ్బులు లో చెత్త పన్ను డబ్బులు కట్ చేసి మిగిలిన డబ్బులు ఇవ్వడం జరుగుతుంది.
విజయనగరంలో అయ్యప్పనగర్లో యు ఎస్ రవికుమార్( అపార్ట్మెంట్ కార్యదర్శి)పై దాడి చేయడం, అపార్ట్మెంట్లో చెత్త మున్సిపల్ సిబ్బందితో వేయించడం వంటి ఘటనలు జరిగిన విషయం తెలిసిందే.వృద్ధులు, వితంతువులు, వికలాంగులనే కనికరము లేకుండా వారి పెన్షన్ల నుండి చెత్త పన్ను మినహాయించి జమ చేసుకోవటం జరుగుతుంది. పొదుపు సంఘాలను బెదిరించి మరీ చెత్త పన్ను వసూలు చేస్తున్నారు. ఇలా అడ్డదారుల్లో చెత్త పన్ను వసూళ్లకు పూనుకోవడం జరుగుతుంది.
నగరంలో 67698 లక్షల కుటుంబాల నుండి, 3946 వ్యాపార సంస్థలు నుంచి చెత్త పన్ను వసూలు చేస్తున్నారు. నగరంలో 57,21,100 లు ప్రతి నెల వసూళ్లు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం 56 చెత్త వాహనాలను తిప్పుతున్నారు, ఈ వాహనాలకు సంవత్సరానికి వాహనానికి కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ప్రతి నెల ఇంటి యజమానులతో సహా అద్దెదారులు నుండి నెలకు 60 రూపాయల నుండి 120 రూపాయల వరకు, చెత్త పన్ను వసూలు చేస్తున్నారు. చిరు వ్యాపారులు మొదలు వ్యాపారులు అందరి వద్ద నుండి నెలకు 150 రూపాయల నుండి 15వేల రూపాయల వరకు చెత్త పన్ను విధిస్తున్నారు. ఫలితంగా ఇప్పటి వరకు విజయనగరం పట్టణంలో 2021 నవంబర్ నుంచి అమలు చేయడంతో ఇప్పటి వరకు 16 కొట్లుకు గాను రూ,5.30,20,260 లు వసూలు చేయడం జరిగింది. మిగిలిన మొత్తాన్ని తర్వాత బలవంతంగా వసూలు చేయనున్నారు. వాస్తవానికి చెత్త పన్ను అనేది ఎప్పుడూ నగర పాలక సంస్థ ల్లో,మున్సిపాలిటీల్లో వసూలు చేయడం జరగలేదు. ప్రపంచ బ్యాంక్ షరుతుల్లో బాగంగా చేసిన సేవలకు వారి నుంచి వసూలు చేయాలి అన్న షరుతు ఆధారంగా ప్రజలపై చెత్త పన్ను వసూలు చేయడం ప్రారంబించారు. ఎన్నికల సంవత్సరం కావడంతో వసూలు విషయంలో కొంత వెనక్కి తగ్గిన ప్రభుత్వం ఎన్నికల అనంతరం అన్ని వర్గాలు ప్రజలు పైన చెత్త పన్ను బలవంతంగా వసులు చేయనున్నారు. ప్రైవేటీకరణ విధానాలలో భాగంగానే చెత్త పన్ను ప్రజలపై బలవంతంగా రుద్దుడం జరుగుతుంది.

➡️