రావికోనలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన

May 8,2024 21:34

 ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : మండలంలో గిరిజన పంచాయితీ అయిన రావికోనలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ దాని ఉల్లంఘిస్తూ అధికార వైసిపి కార్యకర్తలు చట్టవ్యతిరేకానికి పాల్పడుతున్నారని వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్‌ కడ్రక రామస్వామి డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ అధికార వైసిపి కార్యకర్తగా ఉంటున్న అడ్డూరువలసకు చెందిన అల్లూరి రామకృష్ణ రావికోన పంచాయితీ పరిధిలో గల గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేసి వైసిపి స్టిక్కర్లు ఇంట్లో అతికించి ప్రచారం చేస్తున్నారు. ఇలా చేయడం ఎంతవరకు న్యాయమని సిపిఎం తరపున తాము ప్రశ్నిస్తున్నామన్నారు. దీనిపై రిటర్నింగ్‌ అధికారి, సూక్ష్మ పరిశీలకులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్ష, వామపక్ష పార్టీలకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. ప్రతి గ్రామంలోనూ సిద్ధం పేరుతో ఉన్న స్టిక్కర్లు కనబడుతున్నాయని, వెంటనే వాటిని అంటిస్తున్న వారిపై చర్య తీసుకోవాలని కోరారు. ఎలక్షన్‌ కోడ్‌ ఉండగా ఇటువంటి స్టిక్కర్లు అంటించకూడదని తెలిసి కూడా ఈ పని చేస్తున్నారంటే వారి పైన చర్యలు తీసుకోకపోతే మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.

➡️