ఉద్యోగాల భర్తీకి చంద్రబాబు పెద్దపీట

May 8,2024 17:54 #TDP
  • జనసేన, బిజెపి కూటమి టిడిపి అభ్యర్థి కొలుసు పార్థసారధి
    ప్రజాశక్తి-ఆగిరిపల్లి
    తెలుగ ుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే లక్షలాది ఉద్యోగాల భర్తీకి సిఎం నారా చంద్రబాబునాయుడు కృషిచేస్తారని నూజివీడు నియోజకవర్గ తెలుగ ుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి కొలుసు పార్థసారధి హామీ ఇచ్చారు. నూజివీడు, ముసునూరు, ఆగిరిపల్లి, చాట్రాయి మండలాల్లో ఆయన గ త కొన్నిరోజులుగా పెద్దఎత్తున ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఆయన పర్యటించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కె..పి.సారధి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ హామీలు ప్రజానీకానికి ఎంతో మేలు చేస్తాయన్నారు. ఏటేటా జాబ్‌క్యాలెండర్‌ ద్వారా ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటానని ఇప్పటికే చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారని గ ుర్తుచేశారు. అధికారంలోకి రాగానే మెగా డిఎస్‌సిపై తొలి సంతకం చేస్తారన్నారు. ఈనెల 13న జరగ నున్న ఎన్నికల్లో సైకిల్‌ గ ుర్తుపై ఓట్లు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. వైసిపి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల కంటే మరో 15 నుంచి 20 శాతం పథకాలు అదనంగా చంద్రబాబు పాలనలో అందుతుందన్నారు. సక్రమ పాలన అందించాలంటే తిరిగి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సమర్ధవంతమైన నాయకత్వ లక్షణాలు, సుదీర్ఘమైన పరిపాలనా అనుభవం ఒక్క చంద్రబాబునాయుడుకే ఉందన్నారు. అందువల్ల ప్రజలంతా ఈ ఎన్నికల్లో సైకిల్‌ గ ుర్తుకు ఓట్లేసి తనను గెలిపించాలని కోరారు. మహిళల సంక్షేమానికి అనేక కొత్త పథకాలు కొనసాగిస్తామన్నారు. మహిళలను లక్షాదికారులను చేస్తామన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సదుపాయం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నూజివీడు, ఆగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు మండలాలలకు చెందిన టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున పాల్గన్నారు.
➡️