వల్లూరి నరసింహమూర్తి ఆశయ సాధన కోసం కృషి

May 20,2024 12:24 #West Godavari District

ప్రజాశక్తి-ఆచంట (పశ్చిమగోదావరి జిల్లా) :  పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వల్లూ రి  నరసింహమూర్తి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఇందుకూరి సూర్యనారాయణ రాజు అన్నారు. వల్లూరి నరసింహమూర్తి 108వ పుట్టినరోజు సందర్భంగా వల్లూరు గ్రామంలో ఆయన విగ్రహానికి ముందుగా గుడాల వెంకటేశ్వరరావు పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వల్లూరు గ్రామానికి, మొట్టమొదటి  సర్పంచ్ గా  19 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా  ప్రజలకు సేవలు అందించారని, వల్లూరు గ్రామానికి  మొట్టమొదటిగా  ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం, పశువుల ఆసుపత్రి , గ్రామం చుట్టూ పార్కుతీసుకువచ్చారని కొనియాడారు. వల్లూరు కి వెలుగు తీసుకువచ్చింది నరసింహ మూర్తిని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆరుమిల్లి సుబ్బారావు, కట్టుంగ సూర్యనారాయణ, కాపవరపు ఇశ్రాయేలు, దేవల రమేష్, బొర్రా ధర్మారావు, గుడాల వెంకటేశ్వరరావు, ఏడిద వెంకటరాజు, పంది అప్పారావు, ఇందుకూరి సత్యనారాయణ రాజు, ఇందుకూరు శివయ్య, రాఘవ శ్రీనివాస్, పాఠం శెట్టి సత్యనారాయణ, తాళం సుబ్బారావు, నడుంపల్లి బాపిరాజు, రుద్రరాజు సూర్యనారాయణ రాజు మరియు సైకిల్ జట్టు యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

➡️