ప్రజల పక్షాన పోరాడే ఎర్రజెండాను గెలిపించండి

May 8,2024 21:15

ప్రజాశక్తి – కురుపాం : ప్రజల పక్షాన నిరంతరం పోరాడి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ప్రజల మధ్య నిత్యం ఉంటున్న ఎర్రజెండా పార్టీని గెలిపించాలని ఇండియా బ్లాక్‌ బలపర్చిన కురుపాం నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి మండంగి రమణ పిలుపునిచ్చారు. మండలంలోని తిత్తిరి, వబ్బంగి పంచాయతీలో గల ఆవిరి, పులిపుట్టి, టోంపలపాడు, సీడిమానుగూడ, తులసి, పెద తులసి, కాకిలి, తీయాలి, వబ్బంగి గూడ తదితర గిరి శిఖర గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు వచ్చాయంటే బూటకపు హామీలు ఇచ్చి ప్రజల ముందుకు బిజెపి, దాని పొత్తు, తొత్తు పార్టీలు వచ్చి ఓట్లు అడుగుతున్నాయని విమర్శించారు. ఆదివాసీలను అడవులను దూరం చేసి కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నాయన్నారు. జిఒ 3 తీసుకువచ్చి గిరిజనుల హక్కులను బిజెపి కాలరాసిందని విమర్శించారు. గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలను దూరం చేస్తున్న ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలంటే కచ్చితంగా ఎర్రజెండాల పార్టీలే గెలవాలన్నారు. ప్రజలు ఇవన్నీ గమనించి ఎవరైతే మనకు నిత్యం అందుబాటులో ఉండి మన సమస్యల పరిష్కరిస్తారో గ్రహించాలని, చట్టసభల్లో ఆదివాసీల గొంతు వినిపించాలంటే కచ్చితంగా సిపిఎం అభ్యర్థులు గెలవాలని అసెంబ్లీ, పార్లమెంటు రెండింటికీ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి తమకు గెలిపించి, చట్టసభలకు పంపించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు టివి రమణ, ఎం.అడ్డమేశ్వరరావు వి.వాసు తదితరులు పాల్గొన్నారు.పాలకొండ : కొమరాడ : మండలంలోని పొడుగువలస, శిఖవరం, కోరిషీల, లాబేసు, తులసివలస, బందవలస, కెమిశీల, తాడంగివలస, పూజారిగూడ, మర్రిగూడ, రావికోన, కుంభకోట, పాలెం, చెక్కవలస, మాదలంగి, తొడుము, కొట్టులో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గసభ్యులు వి.ఇందిర మాట్లాడుతూ బిజెపిని, దాని మిత్రపక్షాలను ఓడించడం ద్వారానే దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాకూటమి అభ్యర్థుల గెలుపు ద్వారా రాజ్యాంగం పరిరక్షించబడుతుందని, కావున సిపిఎం కురుపాం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మండంగి రమణ, అరకు పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థి పాచిపెంట అప్పలనర్సకు సుత్తీ, కొడవలి, నక్షత్రం గుర్తుపై ఓటు వేసి అత్యధిక ఓట్లు మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రచార కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కొల్లి సాంబమూర్తి, ఎ.జగన్మోహనరావు, అలమండ సురేష్‌, గిరిజన సంఘం నాయకులు రామారావు, రాజశేఖర్‌ పాల్గొన్నారు.గరుగుబిల్లి: సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ మండలంలోని కొంకడివరం, నందివానివలస, గిజబలో బుధవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు బివి రమణ, బంటు దాసు, కరణం రవీంద్ర తదితరులు మాట్లాడుతూ దేశంలో బిజెపి అవలంబిస్తున్న విధానాలతో వ్యవసాయ, పారిశ్రామిక రంగం, చిల్లర వర్తకం పూర్తిగా దెబ్బ తిన్నాయని, ఈ నేపథ్యంలో బిజెపిని, దాని మిత్రపక్షాలను ఓడించడం ద్వారానే దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలని, ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బంటు దాసు మాట్లాడుతూ ఇండియాబ్లాక్‌ అభ్యర్థుల గెలుపు కోసం చైతన్యం కల్గి ఓటు వేయాలని తెలిపారు. ఇండియా బ్లాక్‌ గెలుపు ద్వారా దేశంలో రాజ్యాంగం పరిరక్షించబడుతుందని, కావున సిపిఎం కురుపాం నియోజకవర్గ అభ్యర్థి ముండంగి రమణ, సిపిఎం అరకు పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థి పాచిపెంట అప్పల నర్సకు సుత్తీ, కొడవలి, నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.వీరఘట్టం: భారత రాజ్యాంగాన్ని పరిరక్షణతో పాటు దళిత, గిరిజనుల హక్కులను కాపాడుకోవాలంటే ఇండియా వేదిక బలపరిచిన అరకు పార్లమెంటు సిపిఎం అభ్యర్థి పాసిపెంట అప్పల నరసను గెలిపించాలని మండలంలోని నడుకూరు, విక్రంపురం, నడిమికెళ్ల, చలివేంద్రి, దశమంతపురం, నర్సిపురం, తదితర గ్రామాల్లో సిపిఎం జిల్లా నాయకులు కె.మోహనరావు, సిహెచ్‌ అమ్మన్నాయుడు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి అప్పలనరసను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అలాగే పాలకొండ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సవర చంటిబాబు హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు ఎన్‌ సింహాచలం, తదితరలు పాల్గొన్నారు.గుమ్మలక్ష్మీపురం : రానున్న ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులను గెలిపించి అసెంబ్లీకి, పార్లమెంట్‌కు పంపించినాడే గిరిజనుల కష్టాలు చేరుతాయని సిపిఎం మండల కార్యదర్శి పి తిరుపతిరావు అన్నారు. మండలంలోని చాపరాయి బిన్నిడి, రాయగడ జమ్మూ గ్రామాల ప్రచారం నిర్వహించారు. ఇండియా కూటమి మద్దతుతో అరుకు ఎంపీగా పోటీ చేస్తున్న అప్పల నరసన, కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మండంగి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.గిరిజన హక్కుల కోసం సిపిఎంని గెలిపించండిమెంటాడ : గిరిజన హక్కుల కోసం సిపిఎం అరకు పార్లమెంట్‌ అభ్యర్థి పాచిపెంట అప్పలనర్సను గెలిపించాలని ఆ పార్టీ నాయకులు రాకోటి రాములు కోరారు. బుధవారం మెంటాడ మండలంలోని పనుకువానివలస, తమ్మిరాజుపేట, గుర్ల, రాబ, రొంపల్లి, నెల్లిగుడ్లు పలు గ్రామాల్లో సిపిఎం శ్రేణులతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు, గిరిజనులకు తీరని అన్యాయం చేసిందన్నారు. గిరిజనులు పోరాడి సాధించుకున్న చట్టాలను, గిరిజన హక్కులను కాలరాస్తూ అటవీ సంపదను, కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టేందుకు చూస్తోందని విమర్శించారు. ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తోందని తెలిపారు. ఎన్నికలలో గిరిజన హక్కుల రక్షణ కోసం పోరాడుతున్న సిపిఎంకు ఓటేయాలని కోరారు. కార్యక్రమంలో గిరిజన నాయకులు, జానకిరామ్‌, పెదరాం, సిపిఎం నాయకులు హరికృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

➡️