‘దేవర’ టీమ్‌పై తేనెటీగల దాడి

May 7,2024 19:30 #jr ntr, #movie

అల్లూరి జిల్లా మోదకొండమ్మ పాదాల వద్ద ‘దేవర’ సినిమా షూటింగ్‌ జరుగుతుండగా చిత్ర బృందంపై తేనెటీగలు దాడిచేశాయి. జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా, జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా ‘దేవర’ సినిమా నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. షూటింగ్‌ ప్రదేశంలో ఉన్న తేనెతుట్టెపై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా వచ్చి అక్కడ ఉన్న జూనియర్‌ ఆర్టిస్టులపై దాడి చేశాయి. వారు పరుగులు పెడుతున్న క్రమంలో కొందరు గాయపడ్డారు. దాదాపు 20 మంది ఈ తేనెటీగల దాడిలో గాయపడినట్లుగా సమాచారం. వారిని దగ్గరిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

➡️