సంక్రాంతికి ‘మిషన్‌ చాప్టర్‌1’అరుణ్‌

Dec 27,2023 19:30 #movie, #vijay

విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మిషన్‌ చాప్టర్‌ 1 ఐచ్చంయన్బదు ఇల్లయే. ఈ చిత్రంలో అమీ జాక్సన్‌, నిమీషా సజయన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ అధినేత సుభాస్కరన్‌ విడుదల చేయబోతున్నారు. సంక్రాంతికే ఈ సినిమాను విడుదల చేయనున్నామని చిత్ర బృంద ప్రతినిధులు తెలిపారు. మంచి యాక్షన్‌తో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు. అభిహాసన్‌, భరత్‌ బప్పన్న ముఖ్యపాత్రలు పోషించారు. సంగీతం : జీవీ ప్రకాష్‌కుమార్‌.

➡️