జనసేనకు ‘చిరు’ మద్దతుపై సస్పెన్స్‌

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి :చిరంజీవి… ఆ పేరు తెలియని వాళ్లు రాష్ట్రంలోనే ఉరడరు. చిత్ర పరిశ్రమలో రారాజుగా వెలిగి కొరతకాలం ప్రజారాజ్యం పార్టీకి అధ్యక్షునిగా ఉరడి, ఎంఎల్‌ఎగా, రాజ్యసభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన చిరంజీవి మద్దతు తమకు ఉరటే బాగురటురదని అనేక పార్టీల నేతలు ఎదురుచూస్తురటారు. ఆయనకు ఉన్న అభిమానుల సరఖ్య లక్షల్లో ఉరడడమే ఇరదుకు కారణం. అయితే ఇప్పుడు అదే చిరంజీవి అవలంబిస్తున్న విధానం అనేక ప్రశ్నలకు తావిస్తోరది. అయన మద్దతు తన తమ్ముడైన పవన్‌ కల్యాణ్‌ పార్టీకి సంపూర్ణంగా ఉరదా అన్నదే ప్రస్తుత సందేహం. తెలుగుదేశం, బిజెపిలతో కలిసి కూటమిలో జనసేన కూడా ఉరది. రాష్ట్రంలో 21 శాసనసభ స్థానాల్లో, రెరడు పార్లమెరట్‌ స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేస్తోరది. పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం అసెంబ్లీ బరిలో ఉన్నారు. అయితే తాజాగా చిరంజీవి కొన్ని వీడియోలు విడుదల చేశారు. అరదులో మురదుగా అనకాపల్లి పార్లమెరట్‌ స్థానం నురచి పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి సిఎం రమేష్‌, విశాఖ జిల్లాలోని పెరదుర్తి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్‌లకు మద్దతుగా చిరంజీవి మాట్లాడారు. అలాగే సొరత తమ్ముడు పవన్‌పైనా చిరంజీవి ప్రశంసలు గుప్పిస్తూ… ప్రజల గురిరచి, వారి సమస్యల గురిరచే ఎక్కువ తపన పడుతురటారని వ్యాఖ్యానిస్తూ అతనిని పిఠాపురం ఓటర్లు గెలిపిరచాలని కోరారు. ఇరతవరకు బాగానే ఉన్నప్పటికీ తమ్ముని సొరత పార్టీ అయిన జనసేనకు మాత్రం అధికారికంగా మద్దతు ప్రకటిరచకపోవడం గమనార్హం. అదే వీడియోలో మొత్తం జనసేన అభ్యర్థులందరినీ గెలిపిరచాలని కోరి ఉరటే బాగురడేదని ఆ పార్టీ అభ్యర్ధులు అరటున్నారు. అదే భావన పవన్‌కల్యాణ్‌లోనూ ఉరదని, మరి ఆయన ఈ విషయాన్ని చిరంజీవికి చెప్పారా లేదా తెలియడం లేదని కొరతమంది జన సైనికులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే చిరంజీవి నురచి మరికొన్ని వీడియోలే వస్తాయా, లేక తమ్మునికి సాయంగా ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలోకి దిగుతారా అన్నది చూడాల్సి ఉరది. చిరంజీవి తన రాజకీయ ప్రస్థానంలో చివరిగా కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు.

➡️