అలతి పదాలతో అనంత భావాల సృష్టి

Apr 22,2024 04:40 #edit page, #sahityam

నిగూఢతను కలిగి, సాధారణ వాక్యానికి భిన్నంగా ఉండి మనసును రంజింపజేసే, ఆలోచింపజేసే రచనను కవిత్వం అంటాము. కవిత్వం అంటే అక్షరాల కుంటి నడక కాదు. కవిత్వం అంటే అక్షర తాండవం. కవిత్వం అంటే ఒక అన్వేషణ, ఒక తీరని వేదన. కవిత పాఠకుడిని కదిలించడానికి ముందు కవిని కదిలించాలి. కవిత్వం సమాజ చైతన్యానికి దోహదం చేయాలి.
సాధారణంగా త్యాగం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు అమ్మని ప్రస్తావిస్తారు. అమ్మ త్యాగం వెనుక నాన్న ఉంటాడు, బాధ్యతని భుజాలపై మోస్తూ కుటుంబానికి భరోసా అవుతాడు. కానీ నాన్న త్యాగాన్ని లోకం పెద్దగా గుర్తించదు. నాన్న కూడా అమ్మతో సమానమే అని చెప్తున్నాడు ప్రకాష్‌ నాయుడు తన ”నాన్న ఎందుకో వెనకబడ్డాడు” కవితా సంపుటిలో.
నాన్నలో ఎన్నో భావోద్వేగాల్ని కవిత్వంతో మమేకం చేసి నాన్న ప్రపంచాన్ని మన ముందు ఉంచాడు. ఎన్నో రకాల కవిత్వ వాదాలు ఉన్నా ‘అనుభూతి వాదం’ ఎంచుకొని మనకి కన్నీళ్లు తెప్పిస్తాడు. తన కవిత్వం – డిక్షన్‌ (జూశీవ్‌తీy-సఱష్‌ఱశీఅ) ఆలోచింపచేస్తుంది. ‘అందరు పోతారు ఎపుడో ఒకప్పుడు/ ఈ లోపు ఒకడిని మరొకడు కూల్చుకోవడమే ‘యుద్ధం’ అంటాడు. చిన్నదే కానీ అర్ధం మాత్రం విస్తృతమే. ఈ కవిత్వంలో నాన్నే సర్వ వ్యాపకం అని అనడు. అమ్మకి అంతే స్థానం ఇచ్చాడు. ఓ చోట ఇలా అంటాడు.
”నువ్వు చంద్రుడు, నాన్న సూర్యుడు అని తెలిసిన అమ్మకి/ ఆ ఇద్దరిని మోసే అవకాశం తానే అన్న నిజం” అమ్మకి నిజంగా తెలియదు” (అమ్మకేమి తెలియదు) …. భావోద్వేగంలో హెచ్చు తగ్గులు ఉంటాయా? అమ్మకి కట్టబెట్టిన పీఠం నాన్నకి ఎందుకు ఇవ్వలేదు? అంతర్మధనంలో నాన్న ఎప్పుడూ వెనుకబడతాడు. ప్రతి ఒక్కరికి సరళ అనుభవాలు (ూఱఎజూశ్రీవ వఞజూవతీఱవఅషవర) సాధారణంగా అనుభవానికి గోచరం అయ్యే అనుభవాలు ఉంటాయి. అలాంటి అనుభవం నుంచి వచ్చిందే ‘ఈ నాన్న వెనుకబడ్డాడు’. ప్రతి కవిత్వ రచన వెనుక ఒక బలమైన ఘటన ఉంటుంది. నాన్న ఎందుకు వెనుకబడ్డాడో శీర్షిక కవితలో చెప్తాడు.
”ఏది కావాలంటే అది వండి పెడుతూ అమ్మ/ ఏది కావాలంటే అది కొనిపెడుతూ నాన్న/ ఇద్దరి ప్రేమ సమానమే/ అయినా కూడా అమ్మ కొచ్చిన పేరు ముందు నాన్న వెనుకబడ్డ్డాడు” ప్రేమలో సమానం అయినా ఎందుకో నాన్న వెనకనే ఉంటాడు. అలాగే ”ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ/ తన జీతం అంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న/ ఇద్దరి శ్రమ సమానమే అయినా అమ్మకంటే నాన్న ఎందుకో వెనకబడ్డాడు”
తల్లి తండ్రి ఇద్దరి ప్రాధాన్యతలు ఒక్కటే అయినా ఒక్కరికి మాత్రమే పేరు రావడం వెనుక సామాజిక ఒత్తిడి ఉన్నది. అయితే దీన్ని మనం నిరాకరించలేము. అదొక వాస్తవికత నిరాకరణ (ణవఅఱaశ్రీ శీట =వaశ్రీఱ్‌y)గా పేర్కొనవచ్చు. అయితే ఈ కవితలో చివర్లో ముగింపు మాత్రం నాన్న వైపు నిలబడతాడు ఈ కవి. ”ఇంత నిస్వార్థ జీవి అయినా నాన్న వెనుకబడి పోవడానికి కారణం ఒక్కటే/ అయన మా అందరికి వెన్నెముక కావడమే!” అంటాడు. ఇంకా వివిధ సాహిత్య కోణాలు ఈ కవితల్లో ఎలా ప్రతిఫలిస్తున్నాయో చూద్దాం.
సన్నివేశ వాదం (ూఱ్‌బa్‌ఱశీఅaశ్రీఱరఎ), ప్రవర్తన నిర్ణయకాలలో సన్నివేశం లేదా పరిసర పరిస్థితుల ముఖ్యం అని చెప్పే దృక్పథం. ఒక బలాత్కారం జరిగినప్పుడు ఆడపిల్ల/ మహిళా మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఒక సమస్యలో ఇరుక్కున్నపుడు సమాజం ఎలా తనని చూస్తుంది? సమస్యాత్మక ప్రవర్తన (ూతీశీbశ్రీవఎ bవష్ట్రaఙఱశీతీ) … సమాజ వ్యతిరేకమైనది, వినాశకరమైనది, చికాకు కలిగించేది అయిన ప్రవర్తన. జరిగినదానిలో తన ప్రమేయం లేకున్నా సమాజం చేసే వ్యతిరేక వ్యాఖ్యల వల్ల సమాజంపై వ్యతిరేకత పెంచుకుంటుంది. ‘శీలం ఉండేది అక్కడ కాదు’ అన్న శీర్షికతో ఈ కవి – బాధితురాలి వెనక నిలబడ్డాడు. ”గొడుగు చిల్లు పడిందని ఆకాశాన్ని వర్షానికి తడిసింది అని దేహాన్ని నిందించుకోకు/ ఇదిగో చూడు శీలం కోల్పోవడం అంటే గుండెల మీద కొట్టినవాడి బరువుని/ ఇంకా నువ్వు గుండెలు పైనే మోయడం/ హృదయం స్కలించినప్పుడల్లా/ మైలపడ్డ అంగం ఈ ప్రపంచం:” అంటాడు. ”గమ్యం తెలియని మెయిలు రాయిలా ఎన్నాళ్లు ఇక్కడే పాతుకు పోతావు? …. ఆ పీడకలని మర్చిపో/ బతుకు బతికించు .. ముందుకు సాగిపో వదిలేసి … అంటాడు.
శాబ్దిక వాదం (ఙవతీbaశ్రీఱరఎ) : ఆలోచించేప్పుడు పదాల వెనుక ఉన్న అర్ధం మీద గాక పదాల మీదే ఎక్కువ ఆధారపడటం. ప్రకాష్‌ అర్థం అయ్యే విధం గాను, శాబ్దిహక సాధారణీకరణం (Vవతీbaశ్రీ స్త్రవఅవతీaశ్రీఱఓఝ్‌ఱశీఅ) సార్వత్రిక సర్వామోదిత సూత్రం అనుసరించి రచన చేసాడు. ఈ కవితలని సాధారణ పాఠకుడు సైతం ఆస్వాదించగలడు. చాలామంది కవులు కాల్పనికవాదం (=శీఎaఅ్‌ఱషఱరఎ) రాస్తూ సామాజిక వాస్తవికత (రశీషఱaశ్రీ తీవaశ్రీఱ్‌y)ని విస్మరిస్తారు. ప్రకాష్‌ నాయుడు కవిత్వంలో కూడా కాల్పనిక వాదపు కవిత్వం కనిపిస్తుంది కానీ మొత్తాన్ని ఆక్రమించదు. అభ్యుదయపు ఛాయలు ఉన్న కవితల్ని చూడొచ్చు అందులో. ‘వేశ్య’ కవిత చదివినప్పుడు ఆలూరి బైరాగి రాసిన ‘వేశ్య’ గుర్తుకు వస్తుంది.
”జీవితపు కాళ రాత్రి, గుండెలు పిండే చలి
భగభగమండే ఆకలి
పాపపు చిరిగిన దుప్పటిలో
గడగడ వణికే మనకెందుకు చీదర?” అంటాడు బైరాగి. ప్రకాష్‌ నాయుడు వేశ్య జీవితంలో చీకటి నీడలని మనకి చూపిస్తాడు. ”ఈ శరీరాన్ని పళ్ళ తోటను చేసి చాలా రోజులు అయ్యింది/ వచ్చి ఆకలి తీర్చుకు పోయేవాళ్లు తప్ప/ మా ఆకలి దప్పులని చూసిపోయిన వారు ఎవరూ లేరు.” ఈ పురుష జాతికి సుఖమే తప్ప మా బతుకు ఆకలి ఏమి తెలుసు?” అని ఆమె స్వరంలో ప్రశ్నిస్తాడు.
”రైతు కొడుకు” కవితలో కొడుకు నాన్న కష్టం గుర్తుకు వచ్చినప్పుడు మళ్ళీ ఊరు వెళ్ళాలి అనుకుంటున్నాడు. ”ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్న నాకు/ వర్షం పడిన రోజు రాత్రి నిద్ర పట్టదు/ తడిసిన రాశులు నాన్న కళ్ళని తడి చేసినప్పుడు/ ఆయన కళ్ళలో దాచుకున్న నేను తడిసిపోతాను” అంటాడు. ”పోయిన పంట బిడ్డని చూసి కుమిలిపోతున్న అమ్మా నాన్నల్ని ఓదార్చడానికి నేను మరోమారు ఊరెళ్ళి రావాలి” అనుకుంటాడు. తన కవిత్వం అంతా నాన్న చుట్టే పరిభ్రమిస్తున్నా కూడా అమ్మ వైపు నుంచి కూడా ఆలోచించమంటాడు. ప్రసవించడం అంటే మరో జన్మ ఎత్తడమే. అలాంటిది ఒక బిడ్డకి జన్మ ఇవ్వడం అంటే మరో జన్మ ఎత్తడమే కదా! ”నొప్పుల గది” చదివితే మనసు చలించిపోతుంది. ”నేను ఆ గదిలోకి వెళ్ళాలి. నేను తన పక్కనే నుంచొని/ మా అమ్మ నన్ను కనడానికి పడ్డ అప్పటి పురిటి నొప్పులన్ని/ ఇప్పుడు కళ్లారా చూడాలి.” అని ఆకాంక్షిస్తాడు.
వ్యక్తిగత ప్రేరకం (జూవతీరశీఅaశ్రీ ఎశ్‌ీఱఙవ) ఒక వ్యక్తికి విశిష్ట లక్షణమైన అభ్యస్థ ప్రేరకం లేదా ప్రేరణం. ఆ ప్రేరణ ఎవరినుంచి అయినా రావొచ్చు. కట్టుకున్న ”ఇంటిది: నుంచి అయినా మరి ఏ బంధం అయినా కూడా .. భార్య గురించి నాలుగు మంచిమాటలు ఎవరు చెప్పగలరు భర్త తప్ప. అందుకే ”ఆకాశం లాంటి విశాలమైన ఆమె నుదిటి మీద ఎర్రని సూరీడు కుంకుమై మెరిసినప్పుడు/ ఆమె ఉదయంలా నవ్వుతుంది” అంటాడు. ”మా ఇంట్లో గోడకు తగిలించిన దీపమై రాత్రంతా వెలుగుతూనే ఉంటుంది” అంటాడు. ఒకవైపు నాన్న వెనక బడ్డాడు అంటూనే అమ్మకి, భార్యకి సముచిత గౌరవం ఇచ్చాడు ఈ కవి.
వర్షం ఎంత ప్రమాదమో ఎండ కూడా అంతే ప్రమాదమంటాడు. ఎండాకాలం, ”ఎండా నిజంగానే పాము/ మూలుగుతున్న మా ముసలాడిని కాటేసి తీసుకు పోయింది” ఎండ దెబ్బలకి ముసిలి వాళ్ళు పండు ఆకుల్లా రాలిపోతున్నారు (ఎండాకాలం). ”కాలాలకు కన్నీళ్లు ఉంటాయి/ ఆ కన్నీటి పేరు ఉప్పెన అని తెలిసినప్పుడు, గుండెల్లోకి గోదారి ఒక్కసారిగా భళ్ళున ఉరికిన నీటి శబ్దం (నీటి శబ్దాలు). బతుకంటే మరేమి కాదు ”జీవితంలో ప్రతి మనిషి రెండుసార్లు తప్పకుండా చేసే మైల స్నానపు నీటి శబ్దం/ వర్షం ఎవరో కాదు నెలలో దాక్కున్నా విత్తనాలకు పురుడు పోయడానికి వచ్చిన మంత్రసాని” ఇలా కాలాల్ని కూడా కవిత్వం చేస్తాడు.
వ్యక్తిక వాదం (ఱఅసఱఙఱసబaశ్రీఱరఎ) : మనిషి స్వాతంత్య్రంగా బతకడం కోసం ఎన్నో పనులు చేస్తాడు. ఆత్మ గౌరవంతో ముందుకు సాగాలని కోరతాడు. అయినా కొన్నిసార్లు తప్పదు ఆధారపడటం. ఎన్ని డబ్బులు సంపాదించిన కానీ కొన్నిసార్లు మన వారి చేతి సహాయం అందుకోవాల్సిందే. అది నాన్న అందించే సాయం అయితే చెప్పక్కర్లేదు. నాన్న పంపే ”పొలం బియ్యం” ఎంతో విలువైనవి. ”మన పొలంలో పండిన బియ్యం పంపిస్తున్న/ తినండి/ నాన్న చెప్పిన మాటకే నా కడుపు నిండిపోతుంది/ అవును అయినా వాళ్ళ ప్రేమ అది. అయితే, ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం ఇంత మంచి వాతవరణం నుంచి ఎందుకు మనం వలస పోయాము అని బాధ పడతాము. ”ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ చేతులు నా కుదుపుని నాన్న చేతులు నా జేబుని నింపి ఊరు వదిలి ఎందుకు వచ్చానో నాకు ఇప్పటికి అర్థం కాదు” అంటాడు. ఇది ప్రతి రైతు బిడ్డ బాధనే!
వైఖరి (a్‌్‌ఱ్‌బసవ) సమాజంలో కొందరు వ్యక్తుల పాతాళ, వస్తువుల పట్ల, సన్నివేశాల పట్ల అనుకూలంగా గాని, వ్యతిరేకంగాని ప్రతిస్పందించే ప్రవృత్తి. ఈ కవి వైఖరి చాలా స్పష్టంగా ఉంది. నాన్న గురించే కాకుండా నాన్న చుట్టూ ఉన్న పరిస్థితుల పట్ల సహానుభూతి ఉంది. ”నిశ్శబ్దం” నుంచి మాట్లాడే అవసరాన్ని గుర్తు చేస్తాడు. చిన్న మాటల్లో ఎంత బాగా చెప్పాడో!
”ఆకలి నిండా బతుకు వాసన
జీవితం ఉడుకుతున్న పొయ్యి”
అలాగే ప్రపంచం గురించిన చాలా నిశ్శబ్దంగా చెప్తాడు చూడండి.
”ప్రపంచం ఒక పాత చెప్పు
ఎన్ని సార్లైనా తెగుతుందే కానీ తరగదు.” అంతే! ప్రపంచంతో పాటు మనం నడవాలి.
చివరగా, ”నీ లోపల ఉన్న మనిషి, మృగాన్ని చంపి వేయి” అని మనిషిగా మసులుకోవలసిన అవసరాన్ని గుర్తు చేస్తాడు. ప్రేమతో పాటు తానూ ఒక సామజిక బాధ్యత కలిగిన కవిగా ఈ సంపుటిలో ప్రతిచోటా కనిపిస్తాడు. మనం రోజు చూసే చెత్త వాడిని తాను ఇంకొక కోణంలో చూసాడు. ”వాడు చెత్తోడు కాదు” అంటూ మన ఆలోచన మార్చమంటాడు. ”వాడొక్క రోజు రాకపోతే మనమంతా ముక్కులు మూసుకొని కాపురాలు చెయ్యాల్సిందే./ నువ్విచ్చే చెత్తను అపురూపంగా స్వీకరించే అతని చేతులని తాకి/ మనసులోనైనా ఓ నమస్కారం చెయ్యండి/ ఎందుకంటే, మన మాలిన్యాన్ని తానూ తీసుకొని మనల్ని పునీతులుగా ఉంచేవాడు మనకెప్పుడు గురువుతో సమానం”. అంటాడు.
వచన కవిత్వంలో భిన్న రకాల వాదనలు వినిపిస్తూ బలంగా దూసుకుపోతున్నాడు ఈ కవి. ఈ సంపుటిలో ఇంకా నటుడు, సంస్కారం, ఆకలి తీరినట్టు, కవినైపోతాను, వాడేం మనిషి, కోరిక, దేవుడు రాదు, అదే నవ్వు లాంటి మంచి కవితలు ఉన్నాయి. ”తృప్తిపడ్డ కవి, తృప్తి పడని కథకుడూ నష్టపోతారు” అంటారు. కాబట్టి ప్రకాష్‌ నాయుడు ఈ కవిత్వాన్ని భావోద్వేగాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్తారని ఆశిస్తాను.

– పుష్యమీ సాగర్‌
79970 72896

➡️