షోయబ్‌ మాలిక్‌ మూడో పెళ్లి..!

Jan 20,2024 12:53 #Cricket, #Pakistan, #Sports

పాకిస్తాన్‌ : పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు మాజీ సారథి షోయబ్‌ మాలిక్‌ మరో వివాహం చేసుకున్నారు. నటి సనా జావేద్‌ను పెళ్లి చేసుకున్నట్లు ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించారు. తన పెళ్లికి సంబంధించిన ఫొటోలను మాలిక్‌ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ.. అల్‌హమ్మదులిల్లా అంటూ పేర్కొన్నాడు. ఇంతకుముందు సానియాను పెళ్లి చేసుకోవడానికి ముందే.. మాలిక్‌ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత సానియాను రెండో వివాహం చేసుకున్నాడు. సానియాతో విడాకులు కూడా తీసుకున్నారనే విషయం మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. అయితే.. ఇప్పటికీ వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారా? లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.

➡️