ఎదురులేని రాజస్తాన్‌

Apr 28,2024 00:12 #Sports

లక్నోపై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం
లక్నో: ఐపిఎల్‌ సీజన్‌-17లో రాజస్తాన్‌ రాయల్స్‌ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 196పరుగులు చేయగా… ఆ లక్ష్యాన్ని రాజస్తాన్‌ జట్టు 19 ఓవర్లలో కేవలం 3వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలుత లక్నో జట్టు కెప్టెన్‌ కెఎల్‌ రాహుల్‌(76), దీపక్‌ హుడా(50) అర్ధసెంచరీలతో రాణించారు. రాజస్తాన్‌ బౌలర్లలో సందీప్‌ శర్మకు రెండు, బౌల్ట్‌, ఆవేశ్‌ ఖాన్‌, అశ్విన్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. ఛేదనలో రాజస్తాన్‌ ఓపెనర్లు జైస్వాల్‌(24), బట్లర్‌(34) తొలి వికెట్‌కు 5.5 ఓవర్లలో 60పరుగులు జతచేశారు. ఆ తర్వాత వీరిద్దరూ ఔటైనా.. కెప్టెన్‌ సంజు(71నాటౌట్‌; 33బంతుల్లో 7ఫోర్లు, 4సిక్సర్లు), ధృవ్‌ జురెల్‌(52నాటౌట్‌) బ్యాటింగ్‌లో రాణించి మ్యాచ్‌ను ముగించారు. రియాన్‌ పరాగ్‌(14) నిరాశపరిచాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ సంజు శాంసన్‌కు లభించింది. రాహుల్‌, హుడా చెలరేగగా..
అంతకుముందు లక్నో సూపర్‌ జెయింట్స్‌ పవర్‌ ప్లేలో రాజస్థాన్‌ పేసర్లు బౌల్ట్‌, సందీప్‌ శర్మ ధాటికి రెండు వికెట్లు పడినా.. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(76), దీపక్‌ హుడా(50)లు అడ్డు గోడలా నిలబడ్డారు. మూడో వికెట్‌కు 115 పరుగులు జోడించి లక్నోను పటిష్ట స్థితిలో నిలిపారు. చివర్లో ఆయుష్‌ బదొని(18), కఅనాల్‌ పాండ్యా(15)లు పోరాడడంతో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రాజస్థాన్‌ పేసర్లలో సందీప్‌ శర్మకు రెండు వికెట్లు దక్కాయి.
స్కోర్‌బోర్డు…
లక్నో సూపర్‌జెయింట్స్‌్‌ ఇన్నింగ్స్‌: డికాక్‌ (బి)బౌల్ట్‌ 8, కెఎల్‌ రాహుల్‌ (సి)బౌల్ట్‌ (బి)ఆవేశ్‌ ఖాన్‌ 76, స్టొయినీస్‌ (బి)సందీప్‌ శర్మ 0, దీపక్‌ హుడా (సి)రువన్‌ పావెల్‌ (బి)అశ్విన్‌ 50, పూరన్‌ (సి)బౌల్ట్‌ (బి)సందీప్‌ శర్మ 11, ఆయుష్‌ బడోని (నాటౌట్‌) 18, కృనాల్‌ పాండ్య (నాటౌట్‌) 15, అదనం 18. (20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి) 196పరుగులు.
వికెట్ల పతనం: 1/8, 2/11, 3/126, 4/150, 5/173
బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-41-1, సందీప్‌ శర్మ 4-0-31-2, ఆవేశ్‌ ఖాన్‌ 4-0-42-1, అశ్విన్‌ 4-0-39-1, చాహల్‌ 4-0-41-0
రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి)రవి బిష్ణోరు (బి)స్టొయినీస్‌ 24, బట్లర్‌ (బి)యశ్‌ ఠాకూర్‌ 34, సంజు శాంసన్‌ (నాటౌట్‌) 71, రియాన్‌ పరాగ్‌ (సి)ఆయుష్‌ బడోని (బి)అమిత్‌ మిశ్రా 14, ధృవ్‌ జురెల్‌ (నాటౌట్‌) 52, అదనం 4. (19ఓవర్లలో 3వికెట్ల నష్టానికి) 199పరుగులు.
వికెట్ల పతనం: 1/60, 2/60, 3/78
బౌలింగ్‌: హెన్రీ 3-0-32-0, మొహిసిన్‌ ఖాన్‌ 4-0-52-0, యశ్‌ ఠాకుర్‌ 4-0-50-1, స్టొయినీస్‌ 1-0-3-1, కృనాల్‌ పాండ్యా 4-0-24-0, అమిత్‌ మిశ్రా 2-0-20-1, రవి బిష్ణోయ్ 1-0-16-0

➡️