మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. మాజీ మంత్రి బాబా సిద్ధిఖ్‌ రాజీనామా

ముంబై : మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి బాబా సిద్ధిఖ్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఎక్స్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. ”నేను యుక్తవయసులో భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీలో చేరాను ఇది 48 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. ఈ రోజు నేను భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేస్తాను. ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.” అని ట్విట్టర్‌లో ప్రకటించారు. కాగా మహారాష్ట్రలోని వాండ్రే పశ్చిమ విధానసభ నియోజకవర్గానికి శాసనసభ సభ్యుడుగా సిద్ధిఖ్‌ పనిచేశారు. ఇటీవల మహారాష్ట్ర కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తూ మాజీ మంత్రి మిలింద్‌ దేవరా షాక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

➡️