ప్రతి ఇంటికి 6,000 సాయం : తమిళనాడు సిఎం స్టాలిన్

cyclone-michaung-tn-cm-stalin-announces-6000-as-relief-amount

తమిళనాడు : తమిళనాడులో మిచౌంగ్‌ తుఫాను ప్రభావితమైన కుటుంబాలన్నింటికీ ఒక్కొక్కరికి ₹6,000 చొప్పున ఆర్ధిక సాయాన్ని ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రకటించారు. ఈ మొత్తాన్ని రేషన్ షాపుల ద్వారా అందచేయనున్నామని తెలిపారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని ₹4లక్షల నుండి ₹ 5 లక్షలకు పెంచారు. తుఫాను కారణంగా రాష్ట్రంలో దెబ్బతిన్న గుడిసెలను బాగు చేయడానికి ₹ 5,000 నుండి ₹ 8,000 ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆహార పొట్లాలు, పాలపొడి, తాగునీటి సీసాలు, బ్రెడ్, బిస్కెట్లు తుఫాను ప్రభావిత ప్రాంతాలకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో 25 వేల మందికి పైగా పారిశుధ్య కార్మికులు, విపత్తు నిర్వహణ బృందాలతో కలిసి యుద్ధప్రాతిపదికన పనిచేస్తున్నారని సీఎం చెప్పారు.

పంట నష్ట పరిహారం
33% కంటే ఎక్కువ దెబ్బతిన్న వరి పొలాలకు పరిహారం మొత్తాన్ని హెక్టారుకు ₹13,500 నుండి ₹17,000కి పెంచారు. ఎండిపోయిన పంటల నష్టపరిహారం హెక్టారుకు ₹7,410 నుండి ₹8,500కి పెంచబడింది. ఆవులు మరియు గేదెల కోల్పోయిన వారికి ₹30,000 నుండి ₹37,500 పెంచగా, మేకలు మరియు గొర్రెలను కోల్పోయిన వారికి ₹3,000 నుండి ₹4,000 పెంచారు. మత్స్యకారులకు, వలలతో సహా పూర్తిగా దెబ్బతిన్న పడవలకు పరిహారం ₹32,000కి నుండి ₹50,000కి పెంచారు. పాక్షికంగా దెబ్బతిన్న పడవలకు, మొత్తం ₹10,000 నుండి ₹15,000కి పెంచబడింది.

➡️