కర్ణాటక బిజెపి నేత ట్వీట్‌ను తొలగించండి : ‘ఎక్స్‌’ ను ఆదేశించిన ఇసి

న్యూఢిల్లీ :    కర్ణాటక బిజెపి చీఫ్‌ బి.వై. విజయేంద్ర ట్వీట్‌ను తొలగించాల్సిందిగా మైక్రో బ్లాగింగ్‌ వెబ్‌సైట్‌ ఎక్స్‌ను ఎన్నికల కమిషన్‌ (ఇసి) ఆదేశించింది. గతంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఆదేశించినప్పటికీ .. పార్టీ ఆ పోస్ట్‌ను తొలగించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అభ్యంతరకర పోస్ట్‌పై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదైంది. ” ఈ పోస్ట్‌పై ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదైందని, అయినా ఇప్పటికీ పోస్ట్‌ను తొలగించలేదు ” అని ఇసి ఆ ఉత్వర్వుల్లో పేర్కొంది. బి.వై. విజయేంద్ర అవమానకర పోస్ట్‌పై కాంగ్రెస్‌ ఇసిని ఆశ్రయించింది. ఆ పోస్ట్‌ కారణంగా శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది.

➡️