రిపబ్లిక్‌ డే పరేడ్‌ టికెట్లు : ఆన్‌లైన్‌-ఆఫ్‌లైన్‌లో కొనొచ్చు

న్యూఢిల్లీ : జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా … ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో రిపబ్లిక్‌ డే పరేడ్‌ను ఘనంగా నిర్వహిస్తారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ పరేడ్‌ను చూడటానికి దేశం నలుమూలల నుండి సందర్శకులు ఢిల్లీకి చేరుకుంటారు. అయితే ఈ పరేడ్‌కు హాజరవ్వాలంటే టికెట్‌ను తప్పకుండా కొనాలి. ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లోనూ టికెట్‌లను కొనుగోలు చేసే వీలుంది.

ఆన్‌లైన్‌లో…

రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆమంత్రన్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌ లేదా ఇన్విటేషన్‌ మేనేజ్‌ మెంట్‌ సిస్టమ్‌ లోకి లాగిన్‌ కావాలి. పేరు, పుట్టిన తేదీ, చిరునామాలను నమోదు చేయాలి. జాబితాలో సూచించిన మేరకు మీ గుర్తింపు కార్డును అప్‌ లోడ్‌ చేయాలి. ఆపై ఆన్‌ లైన్‌ లో నిర్ణీత మొత్తం చెల్లిస్తే టికెట్‌ పొందవచ్చు. ఆ తర్వాత టికెట్‌ ను డౌన్‌ లోడ్‌ చేసుకుని ప్రింట్‌ తీసుకోవాలి.

ఆఫ్‌లైన్‌లో..

ఇండియా టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, ఢిల్లీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కౌంటర్లతో పాటు ఢిల్లీలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో రిపబ్లిక్‌ డే పరేడ్‌ టికెట్లను కొనుగోలు చేయవచ్చు. టికెట్‌ కొనుగోలు చేసేందుకు ఒరిజినల్‌ ఫొటో గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది.

➡️