ఇసి తీర్పుపై సుప్రీంకోర్టుకు శరద్‌పవార్‌

Feb 13,2024 14:48 #sharad pawar, #Supreme Court

ముంబయి : ఎలక్షన్‌ కమిషన్‌ (ఇసి) తీర్పుని  సవాలు చేస్తూ నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి) వ్యవస్థాపకుడు శరద్‌పవార్‌ మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇటీవల శరద్‌పవార్‌ మేనల్లుడు అజిత్‌పవార్‌ నేతృత్వంలోని ఎమ్మెల్యే వర్గమే నిజమైన ఎన్‌సిపిగా  గుర్తిస్తున్నట్లు ఇసి ప్రకటించింది.  అలాగే ఎన్నికల గుర్తు ‘గోడ గడియారం’ ను కూడా వారికే కేటాయిస్తున్నట్లు వెల్లడించింది.  అయితే డిప్యూటీ సిఎం అజిత్‌ పవార్‌ ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. శరద్‌ పవార్‌ దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై ఏవైనా ఉత్తర్వులు జారీ చేసే ముందు విచారణ జరపాలని కోరారు.  శరద్‌ పవార్‌పై తిరుగుబాటు ప్రకటిస్తూ.. అజిత్‌ పవార్‌ వర్గం మహారాష్ట్రలో అధికారంలో ఉన్న ఏక్‌నాథ్‌ షిండే-దేవేంద్రఫడ్నవీస్‌ (శివసేన -బిజెపి) సంకీర్ణ ప్రభుత్వంలో చేరిన సంగతి తెలిసిందే.

➡️