స్పందన తెలియజేయండి

  • తమిళనాడు మాజీ మంత్రి బెయిల్‌ పిటిషన్‌పై ఇడికి సుప్రీం కీలక ఆదేశాలు

న్యూఢిల్లీ : మనీలాండరింగ్‌ కేసులో గతేడాది అరెస్టయిన తమిళనాడు మాజీ మంత్రి వి.సెంథిల్‌ బాలాజీ బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) నుంచి స్పందన కోరింది. సెంథిల్‌ బెయిల్‌ పిటిషన్‌పై ఏప్రిల్‌ 29లోగా సమాధాన మివ్వాలని జస్టిస్‌ అభరు ఎస్‌ ఓకా, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఇడిని ఆదేశించింది. ఫిబ్రవరి 28న సెంథిల్‌ బెయిల్‌ పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు కొట్టివేసింది. పిటిషనర్‌ ఎనిమిది నెలలకు పైగా జైలు శిక్ష అనుభవించారనీ, ఈ కేసును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ప్రత్యేక కోర్టును ఆదేశించడం సముచితంగా ఉంటుందని వివరించింది.

➡️