14 మంది వలంటీర్లు రాజీనామా

Mar 31,2024 21:15 #14 volunteers, #resigned

ప్రజాశక్తి-పలాస (శ్రీకాకుళం జిల్లా) :పలాస మండలం బడ్డపాడు పంచాయతీలో పనిచేస్తున్న 14 మంది వలంటీర్లు మూకుమ్మడిగా తమ ఉద్యోగానికి ఆదివారం రాజీనామా చేశారు. వలంటీర్లు ప్రత్యక్ష రాజకీయాల్లోకి పాల్గొనకూడదని చెప్పడంతో తమకు బాధ కలిగించిందని వారు తెలిపారు. అందుకే ఉద్యోగానికి రాజీనామా చేసి నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని చెప్పారు. సోమవారం ఎంపిడిఒ మెట్ట వైకుంఠరావుకు రాజీనామా పత్రాలను అందజేస్తామని తెలిపారు. రాజీనామా చేసిన వారిలో బొడ్డపాడు వలంటీర్లు పత్రి విజయకుమార్‌, బత్తిని ఆశవర్మ, వంకల హేమలత, దున్న పవిత్ర, జడ్డే అనూష, మద్దిల అరుణ, వంకల జానీ, బైనపల్లి సుహాసిని, బైనపల్లి ప్రణరు, రియ్యి రేష్మ, యారుమకు రేవతి, సార లలిత తదితరులు ఉన్నారు.

➡️