భోగి మంటల్లో ఎస్మా ప్రతులు

– సమ్మె శిబిరాల్లో రంగువల్లులు వేసి నిరసన

– రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన అంగన్‌వాడీల సమ్మె

ప్రజాశక్తి – యంత్రాంగం:సమస్యలు పరిష్కరించాలని కోరుతున్న తమ పట్ల రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతూ ఎస్మాను ప్రయోగించిందని, అయితే ఎస్మాకు భయపడబోమని సమ్మె శిబిరాల్లో భోగి మంటల్లో వాటి ప్రతులను వేసి అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. 33వ రోజు సమ్మె శిబిరాల్లో సంక్రాంతి పురస్కరించుకుని ముగ్గులు, భోగి మంటలు వేసి నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకూ సమ్మె కొనసాగిస్తామని అంగన్‌వాడీలు తేల్చి చెప్పారు.గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట సమ్మె శిబిరంలో ముగ్గులు వేసి నిరసన తెలిపారు. పెదకాకానిలో సమ్మె శిబిరాన్ని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి. రమాదేవి సందర్శించి, మద్దతు తెలిపారు. అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకుంటే కోటి సంతకాలతో సిఎం ప్యాలెస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అంగన్‌వాడీలతో వెట్టిచాకిరి చేయించుకుంటూ వారికి కనీస వేతనాలు ఇవ్వడం లేదని, అంగన్‌వాడీలను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. అనంతరం కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో సమ్మె కొనసాగింది. విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద, అనకాపల్లి జిల్లాలోని అనకాపల్లి, కె.కోటపాడు, దేవరాపల్లి, మునగపాక, నక్కపల్లి, కోటవురట్ల మండల కేంద్రాల్లో జిఒ నంబర్‌-2, షోకాజ్‌ నోటీసు ప్రతులను భోగి మంటల్లో వేశారు. అల్లూరి జిల్లా పాడేరు, రంపచోడవరం డివిజన్లలోని మండలాల్లో నిరసనలు చేపట్టారు. జికె.వీధిలో సజ్జల రామకృష్ణారెడ్డి చిత్రపటాన్ని దగ్ధం చేశారు. తిరుపతిలోని పాత మున్సిపల్‌ కార్యాలయం వద్ద, చిత్తూరులోని సిడిపిఒ కార్యాలయం ఆవరణంలో భోగి మంటల్లో ఎస్మా జిఒ ప్రతులను వేసి దగ్ధం చేసి నిరసన తెలిపారు. కార్వేటినగరంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా సంతకాల సేకరణ చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం పార్వతీపురం, కురుపాంలో నిరసన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో భోగి మంటల్లో ఎస్మా ప్రతులను దగ్ధం చేశారు. తమ డిమాండ్లు ప్రతిబింబించేలా కాకినాడ జిల్లా పెద్దాపురంలో నిరసన శిబిరాల వద్ద ముగ్గులు వేసి నిరసన వ్యక్తం చేశారు. కరపలో నిరసన శిబిరంలో పాల్గని ఇంటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో అంగన్‌వాడీ ఆయాకు తీవ్ర గాయాలపాలయ్యారు. ఆమెను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో సమ్మె కొనసాగింది. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలో యుటిఎఫ్‌ నాయకులు అంగన్‌వాడీల సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. కర్నూలు ధర్నా చౌక్‌ వద్ద, నంద్యాలలో రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఆత్మకూరులో మట్టి తింటూ, పగిడ్యాలలో ఉరితాళ్లతో అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. కడప, అన్నమయ్య జిల్లాల కలెక్టరేట్ల ఎదుట రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో చెవులు, కళ్లు, నోరు మూసుకుని నిరసన తెలిపారు. అనంతరం సమ్మె శిబిరం వద్ద నుంచి ర్యాలీగా ప్రకాశం చౌక్‌ సెంటర్‌ వరకు వెళ్లి సంతకాలు సేకరించారు. తాడేపల్లిగూడెంలో చిన్న పిల్లలకు రేగిపండ్లు అందించి తమ నిరసన వ్యక్తం చేశారు. తణుకు కోర్టు వద్ద ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దిష్టిబమ్మను దగ్ధం చేశారు. ఏలూరులో మెడకు ఉరితాళ్లు వేసుకుని నిరసన తెలిపారు. కొయ్యలగూడెం, ద్వారకాతిరుమల, మండవల్లి, భీమడోలులో ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. బాపట్ల జిల్లా, మార్టూరులో సమ్మె శిబిరాల్లో సంక్రాంతి వేడుకలను నిర్వహించి.. భోగి మంటల్లో షోకాజ్‌ నోటీసులను దగ్ధం చేశారు. ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడులో సమ్మె శిబిరాల్లో ఎస్మా ప్రతులను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా పరిధిలోని పామిడి, గుత్తి, గుమ్మఘట్ట, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో ఎస్మా ప్రతులను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. పుట్లూరులో చెరువులోకి దిగి నిరసన తెలిపారు. సత్యసాయి జిల్లా పరిధిలో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. నెల్లూరు జిల్లా కావలిలో ర్యాలీ, ఆత్మకూరులో సంతకాల సేకరణ చేపట్టారు.విజయవాడలో కోటి సంతకాల సేకరణ ప్రారంభంఅంగన్‌వాడీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వేతనాల పెంపుపై స్పష్టతనిచ్చి సమ్మెకు ముగింపు పలకాలని ఆయన ప్రభుత్వాన్నికి విజ్ఞప్తి చేశారు. విజయవాడ ధర్నా చౌక్‌లో దీక్షా శిబిరాన్ని సందర్శించి వ ద్దతునిచ్చిన వారిలో జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షులు జెడి లక్ష్మీనారాయణ, ప్రత్యేక సాధనా సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్‌, సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సత్యారెడ్డి, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావులు ఉన్నారు. అంగన్‌వాడీలకు వేతనాలు పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని మంత్రి బత్స సత్యనారాయణకు జెడి లక్ష్మీనారాయణ ఫోన్‌ చేసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. అంగన్‌వాడీ టీచర్లకు రూ.మూడు వేలు, ఆయాలకు రూ.రెండు వేలు పెంచాలని డిమాండ్‌ చేశారు. వేతనాల పెంపుపై నిర్ధిష్ట ప్రతిపాదన లేకుండా సమ్మెను విరమింపజేయాలని కోరడం సమంజసం కాదన్నారు. అంగన్‌వాడీలను తొలగిస్తామని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని బెదిరింపులకు పూనుకోవడం సరికాదని, ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని సమ్మెకు ముగింపు పలకాలని లేని పక్షంలో అంగన్‌వాడీలు చేపట్టే ఆందోళనకు సంపూర్ణ సహకారం అందిస్తామని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోతిన వెంకటరామారావు, అంగన్‌వాడీ నేతలు బేబీరాణి, సుబ్బారావమ్మ, సుప్రజ, గజలక్ష్మీ పాల్గన్నారు.

 

anganwadi workers strike 33rd protest akp

అనకాపల్లిలో అంగన్వాడీ శిబిరాల వద్ద భోగిమంటల్లో ఎస్మా జీవో కాపీలు, షోకాజు నోటీస్ కాపీలను దగ్ధం చేస్తున్న అంగన్వాడీలు

బోగిమంటలో సజ్జల రామక్రిష్ణ రెడ్డి బొమ్మ దగ్దం

అనకాపల్లి జిల్లా – దేవరాపల్లి : శనివారం అంగన్‌వాడీలు సమ్మే మరింత ఉద్రుతం చేసారు శుక్రవారం వారం ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలమవ్వడంతో మరింత ఆగ్రహంతో బోగిమంటలు వేసి సజ్జల రామాక్రిష్ణరెడ్డి బోమ్మను బోగీమంటలో వేసి దగ్దం చేసారు,అనంతరం ప్రాజెక్టు కార్యదర్శి జి.వరలక్ష్మి పద్మ సన్యాసమ్మ. గౌరి అమ్మాజి గాయిత్రి తదితరులు మాట్లాడారు ప్రభుత్వం చర్చలకు పిలిచి అంగన్వాడీలు వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని పది డిమాండ్లు పరిష్కారం చేసామని,జీతాలు పెంచలేమని అంగన్వాడీలు కావాలనే రాద్దాంతం చేస్తున్నారని సజ్జల రామాక్రిష్ణ దుస్ప ప్రచారం చేస్తున్నారని తెలిపారు,రెండవ ప్రక్క చర్చలకు పిలుస్తు ఎస్మాచట్టాన్ని ప్రయోగించి షోకాజ్ నోటీసులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది పూర్తిగా అప్రజా స్వామికమని పేర్కొన్నారు వెంటనే ఎస్మా జీవోను ఉపసంహరించు కోవాలని లేదంటే మరింతగా సమ్మె ఉద్రుతం చేస్తామని హెచ్చరించారు
ప్రభుత్వ ఇచ్చిన హమిని వెంటనే అమలు.చేయాలని.నాలుగున్నర సంవత్సరాలు ఓపిగ్గా ఉన్నామని ముందుగానే నోటిషులు ఇచ్చి.శాంతియుతంగా సమ్మేచేస్తు ఉంటే.అంగన్వాడీలు సెంటర్లు తాళాలు. బద్దలు గోట్టడం సచి వాలయం ఉద్యోగులు చేత పనులు చేయించడం వంటి చర్యలకు. పూనుకున్నారని తెలిపారు ఇప్పుడు షోకాజ్ నోటిషులు ఇచ్చి పదిరోజుల్లో సమాదానం చేప్పక పోతే ప్రత్యన్మయ ఎర్పాట్లు చేసుకుంటామని సజ్జలరామాక్రిష్ణ రెడ్డి బెదిరింపులకు పూనుకుంటున్నారని తెలిపారు మేము సజ్జలరామాక్రిష్ణరెడ్డికి ఓట్లు వేసి ఉద్యోగం చేస్తున్నామా! లేదా జగన్మోహన్ రెడ్డి దగ్గర పని చేస్తంన్నామా అని ప్రశ్నించారు? వెంటనే ముఖ్యమంత్రి జోక్యం చేసుకోకపోతే సమ్మే మరింతగా ఉద్రుతం చేస్తామని వారు స్పష్టం చేసారు,అదికసంఖ్యలో అంగన్వాడీలు పల్గోన్నారు ఈకార్యాక్రమానికి వ్వవసాయకార్మికసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న బి టి దోర మద్దతు ఇచ్చారు.

 

అండగా ఉంటాం… పోరాడండి…

anganwadi workers strike 33rd protest vzm

కొనసాగుతున్న కోటి సంతకాల సేకరణ

విజయనగరం టౌన్ : శుక్రవారం మంత్రులతో జరిగిన చర్చల్లో వేతనాలు పెంచలేమని చెప్పడాన్ని అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వం మాతో వెట్టి చాకిరి చేయించుకొని శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలని కోరితే వేతనాలు పెంచాల్సిన ప్రభుత్వం డబ్బున్న వేతనాలు పెంచలేమని చెప్పడం దారుణమన్నారు. దీంతో సమ్మె కొనసాగింపు లో బాగంగా గ్రామాల్లో,వీధుల్లో అంగన్వాడీ లు కోటి సంతకాల సేకరణలో ప్రజలు చేత సంతకాలు చేయించి మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు.పండగ వాతావరణంలో కూడా మొక్కవోని దీక్షతో సమ్మెను కొనసాగిస్తూ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. విజయనగరం పట్టణంలో,మండలంలో గ్రామాల్లో కొంగవెలగాడ, కొండ గుంప్పాం,ద్వారపూడి గ్రామాల్లో సంతకాలు సేకరణ చేపట్టారు.కార్యక్రమంలో కోటి, శాంతకళ అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు పాల్గొన్నారు.

 

anganwadi workers strike 33rd protest manyam

మన్యం పార్వతీపురం జిల్లా సాలూరులో ఎస్మా జీవో కాపీలను దగ్ధం చేసిన అంగన్వాడీలు

anganwadi workers strike 33rd protest mylm

ఎన్టీఆర్ జిల్లా-మైలవరం : అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా శనివారం మైలవరం పంచాయతీ కార్యాలయం వద్ద అంగన్వాడీలు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

anganwadi workers strike 33rd protest atp s

33వ రోజు అనంతపురం జిల్లా లేపక్షిలో వేపాకులతో తినీ నిరసన తెలుపుతూ…

anganwadi workers strike 33rd protest wg

  • భోగిమంటల్లో ఎస్మా కాపీలు

పెనుమంట్ర (పశ్చిమగోదావరి జిల్లా) : రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టం  ప్రయోగించిన ఎన్ని నోటీసులు ఇచ్చిన అంగన్వాడీలకు న్యాయం జరిగే వరకూ సమ్మె విరమించేది లేదని అంగన్వాడీల మండల కార్యదర్శి వి సరస్వతి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర  మండలం, పెనుమంట్ర తాసిల్దార్ కార్యాలయం వద్ద   శనివారం 33 వ రోజు అంగన్వాడీల రిలే నిరాహార దీక్షలు కొనసాగయి. ఈ సమ్మెను ఉద్దేశించి  అంగన్వాడి మండల  కార్యదర్శి వి.సరస్వతీ మాట్లాడుతూ  ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలము అయినా సరే కార్మికులంతా ధైర్యంగా ఉండి పోరాడి  సాధించుకుంటామన్నారు. ఈ సందర్భంగా ఎస్మా  జిఓ కాపీ 2.ను. భోగి మంటలో వేసి దగ్గం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సి.ఐ.టి.యి. మండల కార్యదర్శి కోడి శ్రీనివాస్ ప్రసాద్ అంగన్వాడి అధ్యక్షరాలు, సాయి మహాలక్ష్మి, మౌనిక. కార్మికులు. శాంతి కుమారి. జ్యోతి. టి ఎల్ డి . భవాని. ఇ. సుజాత కుమారి. డి కళ్యాణి సుధా . తదితర కార్మికులు పాల్గొన్నారు.   అంగన్వాడీలకు  కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కే సుబ్బరాజు సంఘీభావం తెలిపారు.

 

అమ్మతో పాటు నేను అంటూన్నా చిన్నారి…..
న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేవరకు, వేతనాలు పెంచేవరకు పోరాటం ఆగదు…… విజయవాడలో ధర్నా చౌక్ వద్ద

పోరాడి… పోరాడి… పోరాడి తీరుతాం…. సాధించి, సాధించి, సాధించి తీరుతాం…

anganwadi workers strike 33rd protest nlr

నెల్లూరు జిల్లా – ఇందుకూరుపేట మండల ప్రాజెక్టు : అంగన్వాడి వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న 33వ రోజు సమ్మె లొ పాల్గొన్న ముత్తుకూరు మండల సిఐటియు నాయకులు గడ్డం అంకయ్య , నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మారుబోయిన రాజా మరియు ఇందుకూరుపేట సిఐటియు నాయకులు మైపాటి కోటేశ్వరరావు,ఛాన్ బాషా, మనోహర్,వాసు నాశిన పరశురామయ్య తదితరులు పాల్గొన్నారు

anganwadi workers strike 33rd protest accident a

సమ్మెకు వస్తుండగా జరిగిన రోడ్డు  ప్రమాదంలో గాయపడిన అంగన్వాడీలు

ముగ్గులు వేస్తూ…. నిరసన

anganwadi workers strike 33rd protest

తూగో-కోరుకొండ : మండల కేంద్రమైన కోరుకొండ కాపవరం జంక్షన్ శివుని గుడి సమీపంలో అంగన్వాడీలు వర్కర్స్ ,హెల్పర్స్ సమస్యలపై నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె శనివారానికి 33వ రోజు చేరింది. ఈ సందర్భంగా యూటీఫ్ కోరుకొండ మండల శాఖ నాయకులు సమ్మె శిబిరాన్ని సందర్శించి తమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా యూటీఫ్ నాయకులు మాట్లాడుతూ అంగన్వాడి సమస్యలపై చేస్తున్న సమ్మె న్యాయపరమైనదని, వారి డిమాండ్స్ నాయిపరమైనవని అన్నారు. అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మొండి వైఖరి సరైనది కాదని తెలిపారు. గతంలో సీఎం జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అంగన్వాడీలు కోరుతున్నారన్నారు. ఆర్థికపరమైన జీతాలుపెంపు, గ్రాడ్యుటి, రిటైర్డ్ బెనిఫిట్స్ తదితర అంశాలను అడుగుతున్నారు తప్ప కొత్త కోర్కెలు ఏమీ అడగడం లేదన్నారు. అంగన్వాడీలు చాలీచాలని జీతాలతో తమ కుటుంబాలను పోషించుకోవడం కష్టతరంగా ఉందని, ఉన్న పరిస్థితుల్లో నిత్యవసర వస్తువులు అధికంగా పెరిగాయని, వీరి జీతాలు మాత్రం అలాగే ఉన్నాయని తెలిపారు. ఆటువంటి వారిపై ఎస్మా ప్రయోగించడం, నోటీసులు ఇవ్వడం చాలా దారుణమని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తీరు మార్చుకొని వారికి జీతాలు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూటీఫ్ గౌరవ అధ్యక్షులు ఎం భాస్కర్, అధ్యక్షులు జీవి శివ బాబు, ప్రధాన కార్యదర్శి పి లోవ రాజేష్, ఉపాధ్యాయులు జిఎస్ సుబ్రహ్మణ్యం, అంకం సత్యనారాయణ, టి సత్యనారాయణ, టీవీ భగవానులు,కె వీరబాబు, బి బాపూజీ, సిహెచ్ శ్రీనివాస్ రావు దొర, జి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

anganwadi workers strike 33rd protest ntr

జగ్గయ్యపేటలో అంగన్వాడీ కార్యకర్తల 33వ రోజు సమ్మెకు మద్దతుగా సిఐటియు నాయకులు శ్రీనివాస్

anganwadi workers strike 33rd protest atp

  • 33 రోజు కూడా చెరువులో దిగి నిరసన

అనంతపురం జిల్లా – పుట్లూరు:  మండల కేంద్రంలోని చెరువులోకి దిగి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సూరి మాట్లాడుతూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడి టీచర్ల సమస్యలు హెల్పర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మరింత ఉధృతంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఏవైతే డిమాండ్లు పెట్టారు నెరవేరిచే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని ఈ సమ్మె కూడా ఇలానే కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించినా కరుణ కనికరం లేని ప్రభుత్వం అని అంగన్వాడి టీచర్లు వాపోతున్నారు. మా డిమాండ్ నెరవేరిచే వరకు అనేకమైన రూపాల్లో కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పుట్లూరు మండల కమిటీ నాయకులు రైతు సంఘం మండల కార్యదర్శి వెంకట చౌదరి, బి భాస్కర్ రెడ్డి టీ పెద్దయ్య, నాగభూషణ్, అంగన్వాడి అధ్యక్షురాలు జయలలిత, శశికళ, అనంతలక్ష్మి, అనంతలక్ష్మి, రమాదేవి, టీచర్లు హెల్పర్లు తదితరులు పాల్గొన్నారు.

anganwadi workers strike 33rd protest guduru tpt

తిరుపతి జిల్లా గూడూరులో అంగన్వాడి కార్యకర్తలు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు

విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద దీక్షా శిబిరంలో కోటి సంతకాల సేకరణలో సుబ్బరావమ్మ

విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద దీక్షా శిబిరంలో పాల్గొని అంగన్వాడీల సమ్మెకి మద్దతు తెలిపిన ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు

అనకాపల్లి జిల్లాలో కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె

anganwadi workers strike 33rd protest

అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా నెల్లూరు జిల్లాలో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ…

 

➡️