అంబేద్కర్‌ విగ్రహాల వద్ద సత్యాగ్రహ దీక్షలు

-39 రోజూ కొనసాగిన అంగన్‌వాడీల సమ్మె

-వివిధ రూపాల్లో నిరసనలు

-విజయవాడకు వెళ్లనీయకుండా పలు జిల్లాల్లో అరెస్టులు, గృహనిర్బంధాలు

ప్రజాశక్తి- యంత్రాంగం:అంగన్‌వాడీలు రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ విగ్రహాల వద్ద శుక్రవారం సత్యాగ్రహ దీక్షలు నిర్వహించారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహాలకు వినతిపత్రం అందజేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మనసు మారే విధంగా హితబోధ చేయాలని, తమ వేతనాలు పెంచేలా చూడాలని వేడుకున్నారు. అంగన్‌వాడీల సమ్మె 39 రోజూ కొనసాగింది. వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగించారు. విజయవాడలో జరుగుతున్న నిరవధిక నిరాహార దీక్షలకు రానీయకుండా అంగన్‌వాడీలను, సిఐటియు నాయకులను పలు జిల్లాల్లో పోలీసులు అరెస్టు, గృహనిర్బంధం చేశారు. వేతనం పెంపు, ఇతర సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె విరమించేది లేదని అంగన్‌వాడీలు తేల్చి చెప్పారు. విశాఖలో జివిఎంసి గాంధీ విగ్రహం నుంచి ఎల్‌ఐసి కార్యాలయం సమీపంలోని అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. వారి పోరాటానికి బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌, విశాఖలోని పలువురు కార్పొరేటర్లు మద్దతు తెలిపారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో ఆకుల్లో మట్టి వేసుకొని తిన్నారు. అల్లూరి జిల్లాలో పలు మండలాల్లో అంబేద్కర్‌ విగ్రహాల వద్ద నిరసనలు తెలిపారు. ‘అంబేద్కరా.. మా మొర విను’ అంటూ అంబేద్కర్‌ విగ్రహాలకు తిరుపతి జిల్లా వ్యాప్తంగా వినతిపత్రాలు అందజేశారు. మహిళలకు ప్రత్యేక హక్కులు కల్పించాలని 1951లో తన మంత్రి పదవికి రాజీనామా చేసిన మహనీయుడు అంబేద్కర్‌ అని కొనియాడారు. మహిళా సాధికారత అంటూనే జగన్‌… అంగన్‌వాడీలను రోడ్డున పడేశారని విమర్శించారు. విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ సందర్భంగానైనా ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లాలో అంబేద్కర్‌ విగ్రహాల వద్ద అంగన్‌వాడీలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఇచ్ఛాపురంలో రాస్తారోకో చేశారు. వైఎస్‌ఆర్‌ జిల్లా, అన్నమయ్య జిల్లాల్లో కలెక్టరేట్ల ఎదుట రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. విజయనగరం కలెక్టరేట్‌ వద్ద మానవహారం నిర్వహించారు. బాడంగి సమ్మె శిబిరంలో పెరుమాళి గ్రామానికి చెందిన అంగన్‌వాడీ అనురాధ గురువారం స్పృహ తప్పి పడిపోయారు. ఆమెను తోటి అంగన్‌వాడీలు స్థానిక సిహెచ్‌సికి తరలించారు. బబ్బిలి, సాలూరు, పార్వతీపురంలోని అంగన్‌వాడీల సమ్మె శిబిరాలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు సందర్శించి సంఘీభావం తెలిపారు. తక్షణమే ఎన్నికల హామీలను అమలు చేసి సమ్మెను విరమింపజేయాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీలకు ఎపిటిఎఫ్‌ నాయకులు రూ.5 వేలు పోరాట నిధి అందజేశారు. కర్నూలు ధర్నా చౌక్‌లో అంగన్‌వాడీలు లెంపలేసుకుని నిరసన వ్యక్తం చేశారు. నంద్యాలలో అంబేద్కర్‌ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. గుంటూరులోని చుట్టుగుంట సెంటర్‌ నుండి సిడిపిఒ కార్యాలయం వరకూ ప్రదర్శన నిర్వహించి అక్కడ బైఠాయించారు. అధికారులు ఇచ్చిన షోకాజు నోటీసులకు సామూహికంగా సమాధానం ఇచ్చారు. మంగళగిరిలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి పాల్గని మద్దతు తెలిపారు. కర్నూలు ధర్నా చౌక్‌లో అంగన్‌వాడీల సమ్మె శిబిరాన్ని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి, చంద్రం సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా అంగన్‌వాడీల డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అంబేద్కర్‌ చిత్రపటాలకు, పశ్చిమగోదావరి జిల్లాలో అంబేద్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆచంట, పోడూరుల్లో సమ్మె శిబిరాలను సిపిఎం పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి బలరాం సందర్శించి సంఘీభావం తెలిపారు. పాలకోడేరులో అంగన్‌వాడీలు అంబేద్కర్‌ చిత్రపటానికి నివాళులర్పించి రాజ్యాంగ పీఠిక చదివి ప్రతిజ్ఞ చేశారు. ఏలూరులోని కలెక్టరేట్‌ వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి 24 గంటల సత్యాగ్రహ దీక్ష ప్రారంభించారు. ముసునూరులో దళితవాడలోని ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి 16 గ్రామాల అంగన్‌వాడీలు వినతిపత్రం కలిసి అందజేశారు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అంబేద్కర్‌ చిత్రపటానికి వినతిపత్రం ఇచ్చారు. కాకినాడ జిల్లా కేంద్రంలో 24 గంటల రిలే దీక్ష చేపట్టారు. పెద్దాపురం, తాళ్లరేవులో ర్యాలీ, అంబేద్కర్‌ విగ్రహాల వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. పలు జిల్లాల్లో అరెస్టులు, గృహనిర్బంధాలువిజయవాడలోని జరుగుతున్న నిరవధిక నిరాహార దీక్షలకు వెళ్లనీయకుండా పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో సుమారు 30 మంది అంగన్‌వాడీలను, సిఐటియు నాయకులను తెల్లవారుజామున ఆరు గంటలకు పోలీస్‌ స్టేషన్‌కు తరలించి నిర్బంధించారు. మధ్యాహ్నం తర్వాత వారిని విడుదల చేశారు. ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో పలువురు అంగన్‌వాడీలను, సిఐటియు నాయకులను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. కొంతమందికి నోటీసులు ఇచ్చి ఆయా పరిధిలోని పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. సిఐటియు ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు చీకటి శ్రీనివాసరావును గృహ నిర్బంధంలో ఉంచారు. తన భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అనుమతించాలని కోరినా పోలీసులు అంగీకరించలేదు. గుండెపోటుతో అంగన్‌వాడీ మఅతిఅంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పెదపేటకు చెందిన 78వ సెంటర్‌ అంగన్‌వాడీ వర్కర్‌ కొత్తపల్లి శాంతకుమారి (50) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. సమ్మె విరమించాలంటూ ప్రభుత్వం షోకాజ్‌ నోటీసులు ఇవ్వడంతో ఉద్యోగం పోతుందేమోనని మనోవేదనకు ఆమె గురయ్యారని కుటుంబసభ్యులు తెలిపారు. కొత్తపేట సిడిపిఒ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న సమ్మె శిబిరానికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయి శాంతకుమారి మృతి చెందారు.

anganwadi workers strike 39th day kkd

జీతాలు పెంచకుండా సమ్మె విరమించం

కాకినాడ : అంగన్వాడి వర్కర్లు చేపట్టిన సమ్మె 39వ రోజుకు చేరుకుంది. 24 గంటల రిలే నిరాహార దీక్షలు రెండవ దఫా రెండవ రోజుకు చేరింది. రెండవ రోజు దీక్షలను సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేష బాబ్జి, జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంగన్వాడి వర్కర్లు న్యాయమైన డిమాండ్లపై సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వము, ప్రభుత్వ అధికారులు సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం శుక్రవారమే విధులకు జాయిన్ కాకపోతే ఉద్యోగాల నుంచి తొలగింపులు చేస్తామని ఐసిడిఎస్ అధికారుల నుంచి మెసేజ్లు, ఫోన్ కాల్స్ అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్లకు చేస్తున్నారని ఈ మెసేజ్ లకు ఫోన్ కాల్స్ కు అంగన్వాడీలు భయపడరని సమస్యలు పరిష్కారం చేస్తేనే సమ్మె విరమిస్తారని చట్ట ప్రకారమే సమ్మె నోటిస్ ఇచ్చి సమ్మె చేస్తున్నామని సమ్మె చేస్తున్న వారిని ఏ విధంగా తొలగింపులు చేస్తారని ప్రశ్నించారు.

anganwadi workers strike 39th day akp

అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలో అంగన్వాడీలు సమ్మే 39వ రోజుకు చేరుకుంది ఈసందర్భంగా కె కోటపాడు దేవరాపల్లి మండలాలకు, చెందిన వందలాది మంది అంగన్వాడీలు దేవరాపల్లి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆకుల్లో మట్టి వేసుకోని తింటూ నిరసన తెలిపారు.

విశాఖలో అంగన్వాడీల ర్యాలీ… సంతకాల సేకరణ…

anganwadi workers strike 39th day vzm a

విజయనగరం టౌన్ : అంగన్వాడీ లకు కనీస వేతనాలు చెల్లించాలని,ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె శుక్రవారం నాటికి 39 వ రోజుకి చేరుకుంది.సమ్మెలో భాగంగా స్థానిక కలెక్టరేట్ ఎదుట మానవహారం నిర్వహించారు.

anganwadi workers strike 39th day guduru

తిరుపతి జిల్లా గూడూరులో కొనసాగుతున్న తమ డిమాండ్లు సాధన కోసం అంగన్వాడి ఉద్యోగులు చేస్తున్న నిరసన దీక్షలు ఈరోజుకి 39 రోజులు చేరుకుంది. సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు గూడూరు టవర్ క్లాక్ సమీపంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సత్యాగ్రహం నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగినది.

బాపట్ల జిల్లా – పర్చూరు : 39వ రోజుకు చేరిన అంగనవాడీల నిరవధిక సమ్మె. పర్చూరు తహసిల్దార్ కార్యాలయం వద్ద చేస్తున్న అంగనవాడీల నిరవధిక సమ్మె శనివారం నాటికి 39వ రోజుకు చేరింది. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు విధించిన అంగన్వాడీల న్యాయమైన కోరికలు సాధించేవరకు సమ్మె కొనసాగిస్తామని సిఐటియు నాయకులు కే శ్రీనివాసరావు హెచ్చరించారు. ప్రభుత్వం తమ పట్టుదల వీడి తమ న్యాయమైన కోరికలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రై సంఘం ఉపాధ్యక్షులు బండి శంకరయ్య బి చిన్నదాసు ఎం డేవిడ్ అంగన్వాడీలు ఆయాలు పాల్గొన్నారు.

anganwadi workers strike 39th day sklm

శ్రీకాకుళం జిల్లా – ఎచ్చెర్లలో అంగన్వాడీలు అంబేద్కర్ విగ్రహం ముందు సత్యాగ్రహం చేపట్టారు. ముందుగా ప్రదర్శన నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం, యావత్ జీవితం పోరాడిన డా॥ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఆవిష్కరించడాన్ని హర్షిస్తున్నామని తెలిపారు. అయితే ఏ సామాజిక న్యాయం కోసం ఆయన పోరాడారో దానికోసం ఈరోజు అంగన్వాడీలు గత 39 రోజులుగా సమ్మె చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వారి ప్రధానమైన జీతాల పెంపు కోర్కెలను తిరస్కరిస్తూ వచ్చిందని అన్నారు.

anganwadi workers strike 39th day alluri

అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అల్లూరి జిల్లా వి ఆర్ పురం మండలంలోని రేకపల్లిలొ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని ఇస్తున్న అంగనవాడి వర్కర్స్… ఈ కార్యక్రమంలో జిల్లా సభ్యులు సున్నం రంగమ్మ, మండల అధ్యక్షులు  నాగమణి మండల కార్యదర్శి రాజేశ్వరి అంగన్వాడి వర్కర్స్ ఆయాలు పాల్గొన్నారు.

anganwadi workers strike 39th day annam

కళ్ళు మూసుకొని అంగన్వాడీల నిరసన

అన్నమయ్య జిల్లా-రాజంపేట అర్బన్ : అంగన్వాడీలు చేపడుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా 39వ రోజు ఐసిడిఎస్ కార్యాలయం వద్ద సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు కళ్ళు మూసుకొని నిరసన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిపించి తమ డిమాండ్లు నెరవేర్చాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి నాయకురాలు ఈశ్వరమ్మ, కార్యకర్తలు విజయ, అమరావతి, శివరంజని, గౌసియా, విజయలక్ష్మి, శివ జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నెల్లూరు జిల్లా  రాపూర్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీస్ నందు సమ్మె

ప్రకాశం జిల్లాలో ర్యాలీ నిర్వహించిన అంగన్వాడీలు

anganwadi workers strike 39th day knl

గత 3 రోజులుగా విజయవాడ లో జరుగుతున్న అంగన్వాడీ కార్మికుల నిరవధిక శిబిరంలో దీక్షలో ఉన్న CITU అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కె. సుబ్బారావమ్మ, కర్నూలు జిల్లా అధ్యక్షులు రేణుకమ్మ, అంగన్వాడీ దీక్షలకు మద్దతుగా పాల్గొన్న ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె. ప్రభాకర రెడ్డి

అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలు తాహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన

anganwadi workers strike 39th day atp a

అనంతపురం జిల్లా : 39వ రోజు సమ్మెలో భాగంగా రాయదుర్గంలో అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె శిబిరం వద్ద డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తూ తమ న్యాయమైన సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని రాజ్యాంగంలో కార్మికులకు మహిళలకు కల్పించినటువంటి హక్కులను కాపాడాలంటూ నిరసన వ్యక్తం చేసారు.

anganwadi workers strike 39th day eg

చాగల్లులో అంగన్వాడీలు నిరవధిక సమ్మె

తూర్పు గోదావరి జిల్లా – చాగల్లు  : మండల కేంద్రమైన చాగల్లు  తహశీల్దార్ కార్యాలయం సమీపంలో నిర్వహిస్తున్న అపరిష్కృతంగా ఉన్న అంగన్వాడీలు సమస్యలుపై చేస్తున్న నిరవధిక సమ్మె శుక్రవారం నాటి కి 39వ రోజుకి చేరింది. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ నాయకులుపి విజయ కుమారి. కే లక్ష్మి మాట్లాడుతూ మేము చేస్తున్న నిరవధిక సమ్మె న్యాయమైనవని సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు

anganwadi workers strike 39th day atp

అనంతపురం జిల్లా లేపాక్షి మండలంలో అంగన్వాడీ సిబ్బంది సమ్మెలో భాగంగా అంబేద్కర్ చిత్రపటంకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అంగన్వాడీ సిబ్బంది. సమస్యలు పరిష్కారం చేయాలి అని వారు కోరారు.

anganwadi workers strike 39th day ambedkar

ఆచంట(పశ్చిమగోదావరి జిల్లా) : అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఎస్మా చట్టాన్ని తక్షణమే విరమించుకోవాలని సిఐటియు మండల కార్యదర్శి వద్దిపర్తి అంజిబాబు అన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ  ఆచంట కచేరి సెంటర్లో అంగన్వాడీలు చేస్తున్న సమ్మె శుక్రవారం  39వ రోజుకు చేరుకుంది.  ఈ సందర్భంగా అంగన్వాడీలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలేసి ఘనంగా నివాళులర్పించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంజిబాబు మాట్లాడుతూ అక్క చెల్లెమ్మలు అంటూ ఓట్లు పొంది అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీలకు అన్యాయం చేశారని విమర్శించారు. అనంతరం ఆచంటకచేరి సెంటర్లో సీఎం డౌన్ డౌన్, ఎస్మా చట్టాని తక్షణమే రద్దు చేయాలి,  ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి, సిగ్గు సిగ్గు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

anganwadi workers strike 39th day eluru

అంగన్వాడీల రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా 39వ రోజు శుక్రవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద సత్యాగ్రహ దీక్ష.

 

anganwadi workers strike 39th day

పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలిలో అంగన్వాడీల సమ్మె కొనసాగింపు…

 

అంగనవాడి చలో కార్యక్రమానికి వెళ్లవద్దని సిఐటియు నగర ఉపాధ్యక్షులు తంబి శ్రీనివాసులుకు పోలీసులు నోటీసులు

అంగనవాడి చలో కార్యక్రమానికి వెళ్లవద్దని సిఐటియు నగర ఉపాధ్యక్షులు తంబి శ్రీనివాసులుకు పోలీసులు నోటీసులు

అంగన్వాడి ల రిలే నిరాహార దీక్షలకు విజయవాడ కార్యక్రమానికి వెళ్లకుండా నివారించడానికి Citu నాయకులు చీకటి శ్రీనివాసరావు ఇంటి వద్ద పోలీసులు కాపలా ఉన్నారు బయటికి రానివ్వకుండా హౌస్ అరెస్టు చేసి అక్కడే ఉంచారు.
అంగన్వాడి ల రిలే నిరాహార దీక్షలకు విజయవాడ కార్యక్రమానికి వెళ్లకుండా నివారించడానికి Citu నాయకులు చీకటి శ్రీనివాసరావు ఇంటి వద్ద పోలీసులు కాపలా ఉన్నారు బయటికి రానివ్వకుండా హౌస్ అరెస్టు చేసి అక్కడే ఉంచారు.
➡️