ఎసిబికి పట్టుబడ్డ ఆరిలోవ ఎస్‌ఐ

Mar 14,2024 22:03 #acb, #Arilova SI, #arrested

ప్రజాశక్తి – ఆరిలోవ (విశాఖపట్నం) : విశాఖ నగరంలోని ఆరిలోవ ఎస్‌ఐ ఎసిబికి పట్టుబడ్డారు. ఎసిబి అధికారుల సమాచారం మేరకు..ఓ వ్యక్తి తన కారును మరో వ్యక్తికి విక్రయించారు. అయితే కొనుగోలు చేసిన వ్యక్తి ఫైనాన్స్‌ సరిగా చెల్లించకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. ఇరువురినీ పిలిచి ఆరిలోవ ఎస్‌ఐ హరికృష్ణ కేసు సెటిల్‌ చేశారు. ఇందుకుగాను తనకు రూ.పది వేలు లంచం ఇవ్వాలని ఎస్‌ఐ డిమాండ్‌ చేశారు. తన వద్ద డబ్బులు లేవని కారు కొనుగోలు చేసిన వ్యక్తి చెప్పడంతో ఆయన సెల్‌ఫోన్‌ను ఎస్‌ఐ బలవంతంగా తీసుకున్నారు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఐ లంచం తీసుకుంటుండగా ఎసిబి అడిషనల్‌ ఎస్‌పి శ్రావణి ఆధ్వర్యంలో డిఎస్‌పి రమ్య, సిఐ ప్రేమ్‌కుమార్‌ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

➡️