ఎసిబికి చిక్కిన సివిల్‌ సప్లయిస్‌ అధికారి

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా) : కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సివిల్‌ సప్లయిస్‌ డిప్యూటీ తహశీల్దార్‌ ఎసిబికి చిక్కారు. ఆయనను ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎసిబి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రైస్‌ మిల్లులో పెద్ద ఎత్తున నిల్వలు చేస్తున్నారని, నెలనెలా మామ్మూళ్లు ఇవ్వాలని అవనిగడ్డకు చెందిన రైస్‌ మిల్లు యజమాని వినరుకుమార్‌ను సివిల్‌ సప్లయిస్‌ డిటి శ్రీనివాస్‌ డబ్బులు డిమాండ్‌ చేశారు. ఈ నెలకు రూ.10 వేలు ఇవ్వాలని ఒత్తిడి పెంచారు. దీంతో ఎసిబి అధికారులకు రైసు మిల్లు యజమాని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పక్కా పధకం ప్రకారం మచిలీపట్నం బైపాస్‌ రోడ్డులోని పెట్రోల్‌ బంక్‌ వద్ద మిల్లు యజమాని నుంచి డిటి శ్రీనివాస్‌ లంచం తీసుకుంటుండగా ఎసిబి ఎస్‌పి స్నేహిత రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని స్నేహిత తెలిపారు.

➡️