గాంధీభవన్‌లో బీజేపీపై కాంగ్రెస్‌ ఛార్జ్‌షీట్‌ విడుదల

Apr 25,2024 13:33 #BJP, #Charge sheet, #Congress, #Telangana

హైదరాబాద్‌ : గాంధీభవన్‌లో బీజేపీపై కాంగ్రెస్‌ ఛార్జ్‌షీట్‌ విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బీజేపీ నయవంచన పేరుతో ఛార్జ్షీట్‌ విడుదల చేశారు. పదేళ్లలో బీజేపీ మోసం-వందేళ్ల విధ్వంసం అనేది ట్యాగ్‌లైన్‌. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ దీపాదాస్‌ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పదేళ్లలో మోడీ ప్రభుత్వం దేశ ప్రజలను మోసం చేసిందన్నారు. ”బీజేపీ మోసపూరిత హామీలపై ఛార్జ్‌షీట్‌ విడుదల చేశాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాహుల్‌ నేతృత్వంలో పోరాటం చేస్తున్నాం. దేశ సంపద, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్‌ పోరాటం చేస్తోంది. దేశంలో అల్లకల్లోలం సృష్టించి అధికారం చేపట్టేందుకు బీజేపీ యత్నిస్తోంది. ఈస్ట్‌ ఇండియా కంపెనీ మాదిరిగా బీజేపీ నియంతత్వ ధోరణి ఉంది. సంపదను కొన్ని కంపెనీలకు ధారాదత్తం చేసేందుకు ప్రయత్నిస్తోంది. దేశ సంపద ప్రజలకు చెందేలా చేసేందుకు మేం కృషి చేస్తాం” అని భట్టి విక్రమార్క అన్నారు.

➡️