ఎపి చెస్‌ అసోసియేషన్‌ గుర్తింపు వ్యవహారంపై నిర్ణయం తీసుకోండి

  • ఆలిండియా చెస్‌ సమాఖ్యకు హైకోర్టు ఉత్తర్వులు

ప్రజాశక్తి-అమరావతి : ఎపి చెస్‌ అసోసియేషన్‌కు గుర్తింపు ఇచ్చే అంశంపై ఆరు వారాల్లోగా తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ఆలిండియా చెస్‌ సమాఖ్య కార్యదర్శికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ క్రీడల కోడ్‌ నిబంధనలకు లోబడి సమాఖ్య నిర్ణయం తీసుకోవాలని జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు తీర్పు చెప్పారు. తమ అసోసియేషన్‌ గుర్తింపును ఆలిండియా చెస్‌ సమాఖ్య రద్దు చేయడాన్ని ఎపి చెస్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి సుమన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు, పిటిషనర్‌ వినతిని పరిగణనలోకి తీసుకొని గుర్తింపు విషయంలో చట్ట ప్రకారం తగిన ఉత్తర్వులు జారీ చేయాలంది. గత ఫిబ్రవరిలో ఉత్తర్వుల తర్వాత సమాఖ్య తీసుకోకపోవడాన్ని ఆక్షేపించింది. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన జాతీయ క్రీడల కోడ్‌ గైడ్‌లైన్స్‌ ప్రకారం అన్ని రాష్ట్రాల అసోసియేషన్లకు గుర్తింపు ఇవ్వాల్సిన చట్టబద్ధ బాధ్యత సమాఖ్యదేనని గుర్తు చేసింది. ఆరు వారాల్లోగా సమాఖ్య నిర్ణయం తీసుకుని తెలియజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

➡️