తిరుమలలో వడగళ్ల వాన

ప్రజాశక్తి -తిరుమల : తిరుమలలో మూడు రోజులుగా వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. సూర్యుడి భగభగలతో దాదాపు 42 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రతలు వర్షాల రాకతో 20 డిగ్రీలకు తగ్గి శేషాద్రి వాతావరణం చల్లబడింది. గురువారం మొదలై..శనివారం మధ్యాహ్నం కూడా వడగళ్లతో కూడిన వర్షం పడింది. భారీ ఈదురు గాలుల వల్ల యాత్రికులు కొద్దిపాటి ఇబ్బందులకు గురయ్యారు. వేసవితాపంతో విలవిల్లాడిన యాత్రికులు వానజల్లులను ఆస్వాదిస్తూ తడిసిముద్దయ్యారు. భారీగా కురిసిన వర్షానికి తిరుమలలోని నాలుగు మాఢ వీధులు జలమయమయ్యాయి. శ్రీవారి దర్శనానికి వెళ్ళిన యాత్రికులు బయటకు వచ్చిన తర్వాత వర్షంలో తడిచి ముద్దయ్యారు. తిరుమల పరిసర ప్రాంతమంతా వాతావరణం ఆహ్లాదకరంగా చల్లగా మారిపోవడంతో స్థానికులు హార్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

➡️