KCR రిట్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

Jun 27,2024 12:12 #brs, #KCR, #pitition, #Telangana

హైదరాబాద్‌ : విద్యుత్‌ కమిషన్‌ ఏర్పాటుపై మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయగా ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. కేసీఆర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. కాగా జస్టిస్‌ నర్సింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని కేసీఆర్‌ రిట్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. నర్సింహారెడ్డి ప్రెస్‌ మీట్లు పెట్టి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

➡️