Delhi liquor case: నన్ను జైలుకు పంపొచ్చు.. కవిత సంచలన వ్యాఖ్యలు

Mar 26,2024 12:21 #Delhi liquor case, #ED, #mlc kavita

ఢిల్లీ :ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో కవిత ఈడీ కస్టడీ నిన్నటితో ముగిసింది. దీంతో, ఆమెను ఈడీ అధికారులు కాసేపటి క్రితం ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. కవితను మరో 14 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఈడీ అధికారులు కోరారు. కేసు విచారణ పురోగతిలో ఉందని… పలువురు నిందితులను ప్రశ్నిస్తున్నామని చెప్పారు.
కోర్టు హాల్లోకి వెళ్తున్న సందర్భంగా కవిత అక్కడ ఉన్న మీడియాతో మాట్లాడుతూ.. తనను తాత్కాలికంగా జైలుకు పంపొచ్చని… కడిగిన ముత్యంగా తాను బయటకు వస్తానని చెప్పారు. తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని అన్నారు. ఈ కేసు మనీ లాండరింగ్‌ కేసు కాదని… పొలిటికల్‌ లాండరింగ్‌ కేసు అని విమర్శించారు. ఈ కేసులో ఒక నిందితుడు బీజేపీలో చేరారని, మరో నిందితుడు బీజేపీ టికెట్‌ ఆశిస్తున్నారని చెప్పారు. మూడో నిందితుడు ఎలక్టోరల్‌ బాండ్స్‌ ద్వారా రూ. 50 కోట్లు ఇచ్చారని తెలిపారు. ఇదొక తప్పుడు కేసు అని… తాను క్లీన్‌ గా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు.

➡️