పి.ఎస్.యులను కాపాడుకోవడం మన సామాజిక బాధ్యత

Mar 29,2024 17:14 #Lic, #Privatization, #PSU, #Vizianagaram

ఏఐ ఐ ఈ ఏ మాజీ జాతీయ కార్యదర్శి వేణుగోపాల్
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోడం సామాజిక బాధ్యతగా బావించి ఉద్యమించాలని, ప్రభుత్వ రంగం ఉంటేనే హక్కులు ఉంటాయని అందుకోసం అన్ని వర్గాలు ప్రజలను కలుపుకొని ఐక్యంగా ఉద్యమించాలని ఏ ఐ ఐ ఈ ఎ జాతీయ మాజీ కార్యదర్శి కె.వేణుగోపాల్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఎల్ ఐ సి నాయకులు ఎం.శ్రీనివాస ఉద్యోగ విరమణ సందర్భంగా స్థానిక రెవెన్యూ హోం లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ సంస్థలు ప్రాధాన్యత అనే అంశంపై జరిగిన సదస్సు ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఏ ఐ ఐ ఈ ఏ డివిజన్ అధ్యక్షులు పి.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ నేడు ప్రపంచలో అధ్యాయంలో మూడో స్థానంలో ఉన్న అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్థ మన ఎల్ఐసి అన్నారు. గుడ్ విల్ విషయంలో ప్రపంచలో మొదటి స్థానంలో ఉన్న సంస్థ ఎల్ ఐ సి అని అన్నారు. నేడు అధికారంలో ఉన్న మోడీ ,గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ రంగ సంస్థలు చనిపోయిన సంస్థలు అని వ్యాఖ్యనిచడం జరిగిందన్నారు. ఆయన ప్రధాన మంత్రి అయినా తర్వాత ఎల్ ఐ సి నుంచి డివిడెండ్ రూపంలో 56000 కోట్లు వ్యక్తి మోడీ అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు అయిన ఎల్ ఐ సి,స్టీల్ ప్లాంట్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం మన బాధ్యతగా భావించాలన్నారు. ఎల్ ఐ సి నీ కార్పొరేట్ శక్తులకు అప్పగించాలని మోడీ ప్రభుత్వం చూస్తోందన్నారు. ఎల్ ఐ సి ప్రజలు సొమ్మును ప్రభుత్వం ద్వారానే కాపడుకొగలమ్మన్నరు. ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకించిన వారిపై కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వ విధానాలు ఎల్ ఐ సి కి ప్రతికూలంగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని వ్యతిరేకిస్తామని ఎల్ ఐ సి నీ కాపాడుకోవడమే ధ్యేయంగా నిలబడాల్సిన కర్తవ్యం మనపై ఉందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే విధానాలు అమలు చేస్తున్న బిజెపికి ఓటు వెసామంటే మన మనుగడ మనకు మనమే లేకుండా చేసుకున్నవారం అవుతామన్నారు. 1984లో ఎల్ ఐ సి ఐదు ముక్కలు చేయాలని ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రయత్నిస్తే అప్పటి సిపిఎం ఎంపి దాని యొక్క ప్రాధాన్యత పార్లమెంట్లో చెప్పి ముక్కలు కాకుండా కాపాడుకున్నాది సిపిఎం, ఉద్యోగ సంఘాల పొరటమన్నారు. ప్రభుత్వ రంగాలను కాపడుకోవడమనేది మన సామాజిక బాధ్యత గా ప్రతి ఉద్యోగి భావించాలని, అందుకోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అనంతరం మధ్యతరగతి ఉద్యోగులు కర్తవ్యాలు అనే అంశంపై మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ మాట్లాడుతూ మధ్యతరగతి ఉద్యోగులు పట్ల మెరుగైన సమాజం కోసం ప్రజల్లో చైతన్యం, అవగాహన పెంచాల్సిన సామాజిక బాధ్యత ఉందన్నారు. నేడు ఏదైతే మనం ఉద్యోగాలు చేసి రాజ్యాంగం ద్వారా అనేక హక్కులు పొందుతన్నమో నేడు అదే రాజ్యాంగం ,ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రభుత్వ రంగ సంస్థలను,రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ప్రభుత్వాలే వాటిని కాపడకుండ నియంతృత్వ పాలన సాగిస్తున్నయన్నరు. రాజ్యాంగం కల్పించిన హక్కులు,చట్టాలు నేడు అమలకు నోచుకోలేని స్థితిలో ఉన్నాయన్నారు. ఫెన్షన్ ఫండ్ నీ కూడా షేర్ మార్కెట్లో పెట్టీ ఆ ఫండ్ నీ లాగేసుకోవాలని చుస్తున్నాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను, రాజ్యాంగాన్ని,ప్రజాస్వామ్యాన్ని కాపాడల్సిన ప్రభుత్వాలు ఆ పని చేయలేనప్పుడు ఆ బాధ్యత మనపై, ప్రజలపై ఉందన్నారు. మద్య తరగతి ఉద్యోగులుగా ప్రజలకు చైతన్యం చేయాల్సిన కర్తవ్యం బాధ్యత ఉందన్నారు. ప్రజాస్వామ్యం కంటే వ్యక్తి ప్రాధాన్యత అధికంగా నేటి పాలనలో ప్రజాస్వామ్యం గురించి చెప్పి దానిని కాపాడుకోవడం మనముందున్న కర్తవ్యం అన్నారు.

శ్రీనివాస సేవలు స్ఫూర్తి దాయకం
శ్రీనివాస రిటైర్మెంట్ సభలో వక్తలు
ఘనంగా సత్కరించిన ఇన్సూరెన్స్,ప్రజాసంఘాలు నాయకులు

ఎల్ ఐ సి ఉద్యోగం నుంచి పదవి విరమణ చేస్తున్న ఎం.శ్రీనివాస అందించిన సేవలు స్ఫూర్తిదయకమైనవని ఎల్ ఐ సి ఉద్యోగ సంఘాల, అధికారులు,ప్రజా సంఘాలు నాయకులు అన్నారు.స్థానిక రెవెన్యూ హోం లో జరిగిన రిటైర్మెంట్ సభలో శ్రీనివాస ఎల్ ఐ సి ఉద్యోగిగా, కార్మిక సంఘం నాయకుడిగా, కుటుంబ పెద్దగా ఆయన చేసిన సేవలను అతిథులు కొనియాడారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు పీడిత, శ్రామిక వర్గ ప్రజలు కోసం ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అతిథులు శూచించారు. రిటైర్మెంట్ అనంతరం సమాజం కోసం మరింత సమయం కేటాయించి పేద, బడుగు బలహీన వర్గాలు కోసం పని చేయాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో ఏ ఐ ఐ ఈ ఏ జాతీయ మాజీ కార్యదర్శి కె.వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్సీ ఎం వి ఎస్ శర్మ, బ్రాంచ్ మేనేజర్, పిబి గణేష్, ఎల్ ఐ సి అధికారులు సంఘం నాయకులు, ఏజెంట్లు సంఘం నాయకులు, వివిధ ప్రజా సంఘాలు నాయకులు పాల్గొని ఘనంగా సత్కరించారు.

➡️