కులగణనను వ్యతిరేకించిన బిజెపితో పొత్తు తగదు : జస్టిస్‌ వి ఈశ్వరయ్య

ప్రజాశక్తి గుంటూరు జిల్లా ప్రతినిధి : కులగణనను వ్యతిరేకిస్తూ ముస్లిం రిజర్వేషన్లు ఏత్తేస్తామని ప్రకటించిన బిజెపితో టిడిపి, జనసేన పొత్తు తగదని జాతీయ బిసి కమిషన్‌ మాజీ చైర్మన్‌ జస్టిస్‌ వి ఈశ్వరయ్య అన్నారు. గుంటూరులోని ఓ హోటల్‌లో ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడారు. తాను అన్ని రాష్ట్రాలు తిరిగి బిసిల స్థితిగతులపై అధ్యయనం చేశానని, సిఎం జగన్‌ కులగణన ప్రారంభించడం సంతోషదాయకమని అన్నారు. ఇది ఎన్నికల కారణంగా తాత్కాలికంగా ఆగినా నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి చేస్తారనే నమ్మకం ఉందన్నారు. రూ.వేల కోట్లు కేటాయించి ప్రభుత్వ బడులు, ఆస్పత్రులను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దడం హర్షణీయమన్నారు. సమావేశంలో హైకోర్టు న్యాయవాది ఠాగూర్‌ యాదవ్‌, న్యాయవాది పోకల వెంకటేశ్వరరావు, బిసి నాయకులు డాక్టర్‌ ఆలా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

➡️