మానవత్వం చాటుకున్న కేటీఆర్‌..

May 22,2024 15:31 #KTR, #Telangana

వరంగల్‌ : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదానికి గురైన బాధితుడిని తన ఎస్కార్ట్‌ కారులో ఆసుపత్రికి తరలించారు. వరంగల్‌ లేబర్‌ కాలనీ వద్ద అంజయ్య అనే వ్యక్తి ప్రమాదానికి గురై రోడ్డుపై పడిపోయాడు. ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రచార నిమిత్తం కేటీఆర్‌ హైదరాబాద్‌ నుంచి నర్సంపేట వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆక్సిడెంట్‌ను గమనించిన కేటీఆర్‌ వెంటనే కారు దిగి అత్యవసర చికిత్స నిమిత్తం తన కాన్వారులోని ఎస్కార్ట్‌ కారులో వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కేటీఆర్‌ సకాలంలో స్పందించి బాధితుడికి అండగా నిలిచారని పలువురు కొనియాడారు. అనంతరం నర్సంపేటలో ఏర్పాటు చేసిన వరంగల్‌-నల్లగొండ-ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్‌ పాల్గొన్నారు.

➡️