పామాయిల్‌ ట్యాంకర్‌ బోల్తా – బిందెలు, బక్కెట్లతో పోటెత్తిన జనం

Jun 19,2024 16:42 #overturned, #Palm oil tanker, #peoples

రాజుపాలెం (పల్నాడు) : పామాయిల్‌ ట్యాంకర్‌ బోల్తాపడటంతో స్థానిక ప్రజలు బక్కెట్లతో ఎగబడిన వైనం బుధవారం పల్నాడు జిల్లా అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిపై జరిగింది. నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వెళుతుండగా, రాజుపాలెం మండలం పెదనెమలిపురి వద్ద పామాయిల్‌ ట్యాంకర్‌ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో అక్కడి స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున బక్కెట్లతో, బిందెలతో చేరుకున్నారు. పామాయిల్‌ను పట్టుకెళ్లారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. పోలీసులు అక్కడికి చేరుకుని క్రేన్‌ సహాయంతో ట్యాంకర్‌ను పక్కకు తొలగించి పరిస్థితిని సద్దుమణిగించారు.

➡️