తగ్గిన కెసిఆర్‌, హరీశ్‌రావు మెజార్టీ

  • అల్లుడికి 82308… మామకు 45293

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో: మాజీ సిఎం కెసిఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావుల మెజార్టీ భారీగా తగ్గింది. గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీతో పోల్చుకుంటే ఈ సారి తక్కువ మెజార్టీయే వచ్చింది. సిద్దిపేటలో హరీశ్‌రావు 1,05,514 ఓట్లు సాధించి ఘన విజయం సాధించారు. సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి పూజల హరికృష్ణపై హరీశ్‌రావు 82,308 ఓట్ల మెజార్టీ సాధించారు. గత ఎన్నికల్లో 1,18,699 ఓట్ల మెజార్టీ సాధించి తెలుగు రాష్ట్రాల్లో రికార్డు మెజార్టీ సాధించారు. గతం కంటే ఈ సారి 36,391 ఓట్లు తగ్గాయి. ఇక్కడ పోటీ చేసిన కాంగ్రెస్‌, బిజెపి, బిఎస్‌పి ముగ్గురు అభ్యర్థులూ 20 వేలకు పైగా ఓట్లు పొందారు. దాంతో హరీశ్‌రావు మెజార్టీ బాగా తగ్గింది. గత ఎన్నికల్లో ఆ పార్టీల అభ్యర్థులకు పది వేల ఓట్లైనా రాలేదు. గజ్వేల్‌ నుంచి కెసిఆర్‌ మూడో సారీ గెలిచారు. ఆయనకు 1,11,684 ఓట్లు వచ్చాయి. సమీప బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్‌పై 45,031 ఓట్ల మెజార్టీ సాధించారు. గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి గెలిచిన కెసిఆర్‌కు 50 వేల మెజార్టీ వచ్చింది. ఈ సారి గట్టి పోటీ ఉండటంతో కెసిఆర్‌ మెజార్టీ ఐదు వేలు తగ్గింది.

➡️