TSPSC : తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష తేదీలు ఇవే..

Mar 6,2024 17:05 #Exams, #Group Exams, #Telangana

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ బుధవారం ప్రకటించింది. గ్రూప్ 1 నోటిఫికేషన్‌కు జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష.. అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ నిర్వహిస్తారు. గ్రూప్ 1 ద్వారా 563 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. గ్రూప్ 2లో 783 ఉద్యోగాలు ఉండగా ఆగస్ట్ 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. 2022లో విడుదల చేసిన గ్రూప్ 3లో 1388 ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షలు నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహిస్తారు.

TSPSC announces groups schedule for exams

➡️