రోడ్డు ప్రమాదం ఇద్దరు అక్కడికక్కడే మృతి

ప్రజాశక్తి-పెద్దారవీడు : ప్రకాశం జిల్లాలోని పెద్దారవీడు మండలం గొబ్బూరు వద్ద జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

➡️