తడిచిన ధాన్యం మద్దతు ధరకే కొనుగోలు చేస్తాం : మంత్రి తుమ్మల

May 8,2024 15:08 #Agriculture, #Congress, #Telangana

హైదరాబాద్‌: రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు కీలక ప్రకటన చేశారు. బుధవారం ఖమ్మంలో కిసాన్‌ మోర్చా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన తమ్మల మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రైతులెవరూ అధైర్యపడవద్దని.. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే బడ్జెట్‌ సమావేశాల తర్వాత రైతు భరోసా స్కీమ్‌ కింద రూ.15 వేలు అందిస్తామని ప్రకటించారు. సీఎం రేవంత్‌ రెడ్డి మాటిచ్చినట్లుగా పంద్రాగస్ట్‌ లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు.

➡️