టెస్లాలో కొనసాగుతున్న ఉద్వాసనలు

May 7,2024 21:30 #Business

న్యూయార్క్‌ : ఎలన్‌ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మూడు సార్లు ఉద్వాసనలు ప్రకటించిన టెస్లా మరోమారు వేటుకు పూనుకోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. గత వారం ఇద్దరు సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లను ఇంటికి పంపించారు. రానున్న రోజుల్లో మరింత మంది ఉద్యోగులపై వేటు వేయడానికి కసరత్తు జరుగుతుందని సమాచారం. కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులలో 10 శాతానికంటే ఎక్కువ మందిని తొలగిస్తున్నట్లు ఏప్రిల్‌ 14న ఎలన్‌ మస్క్‌ ప్రకటించారు. ఇందులో రిక్రూట్‌మెంట్‌, మార్కెటింగ్‌, సూపర్‌చార్జింగ్‌ టీమ్‌తో సహా వివిధ విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు.

➡️