డాక్టర్‌ రెడ్డీస్‌కు రూ.1,307 కోట్ల లాభాలు

May 7,2024 21:17 #Business

హైదరాబాద్‌ : ప్రముఖ ఔషధ ఉత్పత్తుల కంపెనీ డాక్టర్‌ రెడ్డీస్‌ గడిచిన ఆర్థిక సంవత్సరం 2023-24 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో రూ.1,307 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే క్యూ4లోని రూ.959.2 కోట్ల లాభాలతో పోల్చితే 36 శాతం వృద్థిని సాధించింది. క్రితం క్యూ4లో డాక్టర్‌ రెడ్డీస్‌ రెవెన్యూ 12 శాతం పెరిగి రూ.7,083 కోట్లుగా నమోదయ్యింది. అమెరికా, యూరపియన్‌ మార్కెట్లలో బలమైన అమ్మకాలు మెరుగైన ఫలితాలకు దోహదం చేశాయని ఆ కంపెనీ తెలిపింది. యూరప్‌లో అమ్మకాలు 5 శాతం, యుఎస్‌లో రికార్డ్‌ స్థాయిలో 29 శాతం చొప్పున పెరిగాయి. మొత్తం ఆర్థిక సంవత్సరం 2023-24లో డాక్టర్‌ రెడ్డీస్‌ నికర లాభాలు 23.6 శాతం పెరిగి రూ.5,568 కోట్లుగా చోటు చేసుకున్నాయి. రెవెన్యూ 13.5 శాతం వృద్థితో రూ.27,916.4 కోట్లుగా నమోదయ్యింది. 2023-24గాను ప్రతీ రూ.5 ఈక్విటీ షేర్‌పై రూ.40 తుది డివిడెండ్‌ను చెల్లించడానికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది.

➡️