సెన్సెక్స్‌ 384 పాయింట్ల పతనం

May 7,2024 21:25 #Business

ముంబయి : అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ భారత స్టాక్‌ మార్కెట్లు ప్రతికూలతలో ముగిశాయి. మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 382.69 పాయింట్లు కోల్పోయి 73,511.85 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 600 పాయింట్ల మేర కోల్పోయినప్పటికీ చివరి దశలో కొంత పుంజుకున్నాయి. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 141 పాయింట్ల నష్టంతో 22,303 వద్ద నమోదయ్యింది. ముఖ్యంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండిస్టీస్‌, ఐసిఐసిఐ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌, ఇండుస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌ సూచీలు అమ్మకాల ఒత్తిడికి గురి కావడంతో మార్కెట్లు పతనాన్ని చవి చూశాయి.

➡️