లక్నో ప్లాంట్‌లో 9 లక్షల యూనిట్ల తయారీ- టాటా మోటార్స్‌ వెల్లడి

May 7,2024 21:20 #Business

లక్నో : దేశంలోనే అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌ తన అత్యాధునిక లక్నో ఫెసిలిటీ నుండి 9లక్షల యూనిట్లను తయారు చేసి.. నూతన మైలురాయిని నమోదు చేసినట్లు తెలిపింది. 600 ఎకరాల విస్తీర్ణంలోని ఈ లక్నో ప్లాంట్‌ను 1992లో ఏర్పాటు చేసింది. ఇక్కడ తేలికపాటి, మధ్యతరహా, మధ్యస్థ, భారీ వాణిజ్య వాహనాలు, అలాగే ఎలక్ట్రిక్‌, ఫ్యూయల్‌ సెల్‌ ఎలక్ట్రిక్‌ బస్సులతో సహా అనేక రకాల కార్గో, ప్రయాణీకుల వాణిజ్య వాహనాలను ఉత్పత్తి చేస్తోంది.

➡️