సెప్టిక్‌ ట్యాంక్‌ కోసం తవ్విన గోతిలో పడి వృద్ధుడికి తీవ్ర గాయాలు

ప్రజాశక్తి – ఎస్‌ ఆర్‌ పురం (చిత్తూరు) : సెప్టిక్‌ ట్యాంక్‌ కోసం తవ్విన గోతిలో వృద్ధుడు పడిపోవడంతో తీవ్ర గాయాలైన ఘటన ఎస్‌ఆర్‌ పురం మండలంలో సోమవారం జరిగింది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్‌ఆర్‌ పురం మండలంలోని సి.కె.పురం గ్రామానికి చెందిన కృష్ణమ్మ నాయుడు (60) ప్రమాదవశాత్తూ సెప్టిక్‌ ట్యాంక్‌ కోసం తవ్విన గోతిలో పడిపోయాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన స్థానిక ఎస్‌ ఆర్‌ పురం పిహెచ్‌సి కేంద్రానికి తీసుకొచ్చారు. వెంటనే డాక్టర్లు అతనికి వైద్యం అందించి మెరుగైన వైద్యం కోసం 108 వాహనం ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

➡️