బి.కొత్తకోటలో కుండపోత

May 8,2024 15:23 #Annamayya district, #floods

ప్రజాశక్తి – బి.కొత్తకోట (రాయచోటి-అన్నమయ్య) : తంబళ్లపల్లె నియోజకవర్గం, బి.కొత్తకోట మండలంలో కుండపోత వర్షం కురిసింది. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయింది. మంగళవారం రాత్రి సమయంలో కురిసిన భారీ వర్షానికి, పట్టణంలోని పలు దుకాణాలు, పురాతనమైన చెన్నకేశవ స్వామి ఆలయం నీటి మునిగింది. గతంలో 2021లో రాత్రి వేళలో కురిసిన భారీ వర్షంతో ఆలయం నీటమునిగిందని ఆలయ అర్చకులు కేశవ స్వామి తెలిపారు దేవాదాయ శాఖ వారు ప్రత్యేక దఅష్టి వహించి ఆలయ నిర్మాణం లోకి నీరు రాకుండా మరమ్మతులు చేయించాలని కోరారు.

➡️