31న చంద్రబాబు రోడ్ షో

Mar 29,2024 00:24 ##tdp #Bapatla #narendravarma

ప్రజాశక్తి – బాపట్ల
నియోజకవర్గంలో ఈ నెల 31న టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు రోడ్ షో జరుగుతుందని టిడిపి కూటమి అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మ తెలిపారు. స్థానిక టిడిపి కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతి పరుడిని ఇంటికి పంపి బాపట్ల నియోజకవర్గాన్ని అవినీతి రహితంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని నరేంద్రవర్మ అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. బాపట్ల పార్లమెంటు టిడిపి అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ రెండు లక్షల ఓట్ల మెజారిటీతో తాము గెలుపొందుతామని అన్నారు. పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో టిడిపికి సానుకూలంగా ఉందని అన్నారు. సమావేశంలో యార్లగడ్డ లక్ష్మీ నారాయణ, జనసేన ఇన్‌ఛార్జి నామన శివన్నారాయణ, టిడిపి పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తాడికొండ దయాబాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాతా జయ ప్రకాష్ నారాయణ, టిడిపి రాష్ట్ర కార్యదర్శి సలగల రాజశేఖర్ బాబు, టిడిపి పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీను, విన్నకోట వీరయ్య నాయుడు, షేక్ కరిముల్లా, దాసరి యేసుబాబు, హుస్సేన్ బేగ్ (దాదా), మామిడి రమేష్ కుమార్, తోటకూర శ్రీనివాసరాజు, సాంబ శివారెడ్డి, కొమ్మినేని సూర్యనారాయణ పాల్గొన్నారు.

➡️