ప్రజలకు అందుబాటులో ఉంటా : బాలాజీ

Feb 24,2024 23:24

ప్రజాశక్తి – పర్చూరు
ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని, మరోసారి జగనన్నను సిఎంగా, తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని వైసిపి ఇన్‌ఛార్జి యడం బాలాజీ కోరారు. పర్చూరు ప్రజలకు సేవ చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. వైసిపి కార్యాలయాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను సమన్వయకర్తగా నియమించడం పట్ల జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో చాలా సమస్యలు వున్నాయని అన్నారు. వాటన్నింటినీ పూర్తిగా పరిష్కరించే విదంగా కృషి చేస్తానని తెలిపారు. కార్యకర్తలు నేరుగా వారి సమస్యలు పరిష్కారానికి తనను కలసుకోవచ్చని తెలిపారు. మైనింగ్, ఇసుక, మట్టి మాఫియాకు తాము పూర్తిగా వ్యతిరేకమని తెలిపారు. అవి నిర్వహించేవారిని తాను ఉపేక్షించనని హెచ్చరించారు. సంక్షేమ పథకాలు అందించడమే వైసిపి అజెండా అన్నారు. ఈపాటికే జగనన్న 33సంక్షేమ పథకాలను అమలు చేశారని అన్నారు. వాటిని కొనసాగించేందుకు జగనన్నను మరోసారి సిఎం చేయాలని కోరారు. కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్ కటారి అప్పారావు, మాజీ ఎంపీపీ కొల్లా వెంకటరావు, గాజుల రమేష్, ఎంపీపీ ఆనంద కుమారి, వైస్ ఎంపీపీ కోట ప్రసన్నశ్రీనివాస్, జెసిఎస్‌ కన్వీనర్ ఎం రాఘవయ్య పాల్గొన్నారు.

➡️