కొయ్యలగూడెంలో గ్రామీణ భారత్

Feb 16,2024 12:54 #Eluru district
farmers rural bandh against modi govt eluru a

ప్రజాశక్తి-కొయ్యలగూడెం : కొయ్యలగూడెం మండల కేంద్రంలో గ్రామీణ భారత్ బంద్ పారిశ్రామిక సమ్మె నేపథ్యంలో కొయ్యలగూడెం సంతమర్కెట్ వద్ద సీ.ఐ.టీ.యూ, ఏ.ఐ.టి.యు.ఎస్, ఐ.ఎఫ్.టి.యు, ఎ ఐ కే కే ఏస్. డి ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు అధ్యక్షులుగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శుక్ల బోయిన రాంబాబు వ్యవహరించారు. ఆయన మాట్లాడుతూ, ఆదనీ, అంబానీ లకు మేలు కలిగేలా బిజెపి ప్రభుత్వం పరిపలిస్తుంది అని, 2 కోట్ల మంది ఉద్యోగాలు కల్పిస్తామని, నిరుద్యోగం గత 50 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది అని, స్విస్ బ్యాంక్ నుంచి నల్లదన్నని వెనక్కు తెచ్చి ప్రతి ఒక్కరి, అకౌంట్లో 15 లక్షలు జమ చేస్తాం అని చెప్పి, చెయ్యలేదు అని, అదే విధంగా రాష్ట్రానికి రావాల్సిన, ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ లాంటివి గాలి మాటలు గా మార్చారు అని కేంద్ర, రాష్ట ప్రభుత్వాలను దుయ్యబట్టారు. అనంతరం ఏ.ఐ.టి.యు.ఎస్ నాయకులు జమ్మి శ్రీనివాసు మాట్లాడుతూ, బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో దేశంలో కార్మిక, కర్షక లు ఇబ్బంది పడే విధంగా చట్టాలు తీసుకువస్తుంది అని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. 4 లేబర్ కోడ్స్ తీసుకురావడంతో కార్మికుల జీవిత లను మరింత సంక్షోబంలో నెట్టారు అని, శ్రామిక నిజ వేతనాలు 20 శాతం తగ్గిపోయాయి అని, ప్రపంచంలో ఆకలి బాధలో 111 స్థానంలో ఉంది అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐ.ఎఫ్.టి.యు నాయకులు నడపల ముక్కరెడ్డి మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 10 యేళ్లు పూర్తి అయింది. ప్రభుత్వం సాధించింది ఏమీ లేదు అని అన్నారు. సహజ వనరులు, కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లు పరం చేస్తుంది అని అన్నారు. ఎ ఐ కే కే ఏస్ డీ నాయకులు రంగనాథo, మాట్లాడుతూ, కనీస వేతనాలు నిర్ణయించే విధానం పూర్తిగా తీసేసింది , సమ్మె హక్కులను కాలరాసే విధాన చర్యలకు పాల్పడుతోంది. శ్రమ దోపిడీ చేస్తుంది, కనీస వేతనం 26000 నిర్ణయిచెందుకు బిజెపి ప్రభుత్వం అంగీకరించడం లేదు అని అన్నారు. అనంతరం సభ ప్రాంగణo నుంచి కొయ్యలగూడెం మెయిన్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జొన్నకుటి వెంకటేశ్వరరావు, తడి గడప ఆంజనేయ రాజు, ఆకుల దుర్గారావు, ఏస్ శివ కుమార్, అంగన్వాడి వర్కర్స్ ఏస్. శివ రత్న కుమారి, కే నగవేని, జ్యోతి, అడపా జ్యోతి, కే గంగారత్నం తదితరులు పాల్గొన్నారు.

➡️