కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులను గెలిపించాలి : గుంటూరు సిపిఎం నేతలు

ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : చేనేత కార్మికుల సమస్యలు, గీత కార్మికుల సమస్యలు, వృత్తిదారుల సమస్యలు పరిష్కారం కావాలంటే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు అన్నారు. ఆదివారం మంగళగిరి పట్టణంలోని 22వ వార్డు, పాత మంగళగిరి ప్రాంతాల్లో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఇండియా బ్లాక్‌ వేదిక తరపున పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి జన్న శివశంకరరావు, గుంటూరు పార్లమెంటుకు పోటీ చేస్తున్న సిపిఐ అభ్యర్థి జంగాల అజరు కుమార్‌ ల విజయాన్ని కాంక్షిస్తూ విస్తృతం గా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ మంగళగిరిలో చేనేత కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని వారి సమస్యలు పరిష్కారం కావాలంటే మంగళగిరి నుండి పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి ధర్నా శివశంకరరావును గెలిపించాలని కోరారు. చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో అధికార వైసిపి, ప్రతిపక్ష టీడీపీ పార్టీలు విఫలమయ్యాయని విమర్శించారు. బిజెపిని సపోర్ట్‌ చేస్తున్న టిడిపి జనసేన పార్టీలను, లోపాయి కారిగా సర్దుబాటు చేసుకున్న వైసిపిని ఈ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. సిపిఎం సీనియర్‌ నాయకులు పి బాలకఅష్ణ మాట్లాడుతూ చేనేత రక్షణ కొరకు పని చేస్తామని చెప్పి అధికార, ప్రతిపక్ష పార్టీల మాటలను నమ్మవద్దని అన్నారు. మూడు పర్యాయములు ఇక్కడ నుండి గెలిచిన చేనేత వర్గానికి చెందిన శాసనసభ్యులు చేనేత పరిశ్రమ రక్షణ కొరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. షెడ్డు కార్మికులకు నేతన్న నేస్తం పధకం అమలు చేయాలని అనేక పర్యాయములు ముఖ్యమంత్రి దఅష్టికి తీసుకెళ్లినప్పటికీ పరిష్కారం చేయలేదని అన్నారు. ఇంటింటికి తిరిగి విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రజల నుండి స్పందన లభిస్తుంది. ఈ కార్యక్రమంలో సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్‌ ఎస్‌ చంగారు, సిపిఎం మంగళగిరి పట్టణ కార్యదర్శి వై కమలాకర్‌, పట్టణ నాయకులు మున్నంగి చలపతిరావు, జె శివ భవన్నారాయణ, సిపిఎం నాయకులు కే సాయికుమార్‌, వి ఆంజనేయులు, కే నవిత, కే ఏడుకొండలు, ఎల్‌ అరుణ, తులసి, ఎం కిరణ్‌, కే. ఆంజనేయ రెడ్డి, గోలి దుర్గాప్రసాద్‌, బి స్వామినాథ, ఎం చంద్ర, చంద్రమౌళి, షేక్‌ కాసిం వలి, షేక్‌ ఖాసిం షాహిద్‌, నాగబాబు తదితరులు పాల్గొన్నారు.

➡️