కార్మికుల హక్కుల రక్షణ దినంగా మేడే : సిపిఎం

Apr 28,2024 21:27

ప్రజాశక్తి-గుంటూరు : ప్రపంచ కార్మిక పర్వదినం మేడే సందర్భంగా వాడవాడలా అరుణ పతాకాలను ఆవిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. కార్మిక వర్గం తమ సమస్యల పరిష్కారం కోసం మొట్టమొదటిసారిగా అత్యంత పెద్ద పెట్టుబడిదారీ దేశమైన అమెరికాలోని చికాగో నగరంలో తిరగబడి తమ హక్కుల సాధనకు ఉద్యమించిందని పేర్కొన్నారు. ఆ సందర్భంగా కార్మికుల రక్తంతో తడిచిన ఎర్రజెండా పోరాటాలకు గుర్తుగా మేడే రోజు ప్రపంచవ్యాప్తంగా జెండా ఆవిష్కరణలు జరుగుతున్నాయని తెలిపారు. నాటి నుండి నేటి వరకు కార్మికవర్గం అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసి కార్మిక చట్టాలను సాధించుకుందని, కానీ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక ఆ చట్టాలను రద్దుచేసి కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలమైన సవరణలు చేస్తోందని విమర్శించారు. ఈ నేపథ్యంలో కార్మికవర్గం తమ హక్కుల రక్షణకు దీక్షా దినంగా మేడేను నిర్వహించాలని పిలుపునిచ్చారు.

➡️